దగ్గుబాటి కాంపౌండ్ రీమేక్ ల ట్రాక్ రికార్డ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` ని `నారప్ప` టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన తాజా చిత్రం `దృశ్యం 2` తెలుగు రీమేక్ ని అధికారికంగా ప్రారంభించారు.
విక్టరీ వెంకటేష్ - మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2014 లో విడుదలైన విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ `దృశ్యం` కి సీక్వెల్ ఇది. మలయాళంలో మోహన్ లాల్ - మీనా ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు వెర్షన్లలో వెంకీ- మీనా జంటగా నటిస్తున్నారు.
దృశ్యం 2 రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్స్ దృశ్యం .. దృశ్యం 2 లను తెరకెక్కించిన దర్శకుడు జీతు జోసెఫ్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. తెలుగు వెర్షన్ ని ఒరిజినాలిటీ చెడకుండా యథాతథంగా తెరకెక్కిస్తున్నారా.. ఏవైనా మార్పు చేర్పులు ఉంటాయా? అన్నది తెలియాల్సి ఉంది.
ఈ చిత్రంలో నదియా- నరేష్- ఎస్తేర్ అనిల్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ - ఆశీర్వాద్ సినిమాస్- రాజ్ కుమార్ థియేటర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్ బాబు- ఆంటోనీ పెరుంబవూర్- రాజ్ కుమార్ సేతుపతి నిర్మాతలు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్చి నుండి హైదరాబాద్ లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది.