పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’లో వీళ్లిద్దరికీ సన్నిహితుడైన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఒక క్యామియో రోల్ చేసినట్లుగా చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. విడుదల ముంగిట ఈ పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరిగింది. కానీ తీరా చూస్తే సినిమాలో ఆ సీన్ లేదు. నిడివి ఎక్కువైందనో.. ఇంకేదైనా కారణమో కానీ వెంకీ ఉండే మూణ్నాలుగు నిమిషాల సీన్ తీసి పక్కన పెట్టేసి సినిమాను రిలీజ్ చేశారు. కానీ టైటల్ కార్డ్స్ లో మాత్రం వెంకీకి థ్యాంక్స్ చెప్పారు. ఐతే ఇప్పుడు ఈ సన్నివేశాన్ని రెండు మూడు రోజుల తర్వాత కలుపుతారనే ప్రచారం జరుగుతోంది. అదెంత వరకూ నిజమో కానీ.. ఈలోపు వెంకీ క్యామియోకు సంబంధించిన విశేషాలు బయటికి వచ్చాయి.
‘అజ్ఞాతవాసి’లో ఇంటర్వెల్ కు ముందు కీర్తి సురేష్ తో కలిసి పవన్ వెళ్తుండగా.. మార్కెట్లో అతడిపై దాడి చేయడం.. ఒక పక్క మహాభారత పారాయణం జరుగుతుంటే.. పవన్ సైలెంటుగా తనను అటాక్ చేసిన వాళ్లను చంపడం జరుగుతుంది. ఆ సీన్ అయ్యాక వెంకీ ఎంట్రీ ఇస్తాడట. ఆయన పోలీస్ జీపులో వచ్చి దిగుతాడట. ఇదంతా ఎవరు చేశారు అని వెంకీ అడగడం.. పవన్ తానే అనడం.. మధ్యలో ‘గబ్బర్ సింగ్’లోని ‘నాకు తిక్కుంది దానికో లెక్కుంది’ డైలాగ్ ఇద్దరి నోటా పలకడం.. ఇలా సాగుతుందట సీన్. మొత్తంగా ఆ సీన్ ఫన్నీగానే వచ్చిందని.. సినిమాలో అది ఉంటే బాగుండేదని అంటున్నాయి యూనిట్ వర్గాలు. మరి ఒకట్రెండు రోజుల తర్వాతైనా ఈ సీన్ సినిమాలోకి వస్తుందేమో చూడాలి.