సాధారణంగా తమిళంలో సినిమా ఓ మాదిరిగా హిట్టయితే చాలు... దానిని అర్జెంటుగా డబ్బింగ్ చేసేయడమో.. లేకపోతే రైట్స్ కొనుక్కొని రీమేక్ చేయడమో మన తెలుగు ఇండస్ట్రీ పీపుల్ కు అలవాటే. కానీ ఏం చేస్తారు... ఓ రకంగా తమిళ సినీ జనాలే హిట్ కోసం మొహంవాచిపోయి ఉన్నారు. ఈ ఏడాది కాలంలో అక్కడ సరైన హిట్ సినిమా అంటూ వచ్చింది ఒక్కటే. అదిే విక్రమ్ వేద. మాధవన్ - విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాకు భార్యాభర్తలైన గాయత్రి అండ్ పుష్కర్ దర్శకత్వం వహించారు.
విక్రమ్ వేదలో మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర చేయగా.. విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ పాత్ర చేశాడు. తమిళ వెర్షన్ నిర్మాత శశికాంత్ ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మాధవన్ పాత్ర రానాతో... విజయ్ సేతుపతి పాత్ర వెంకటేష్ తో చేయించాలని అనుకున్నారు. ఈ ప్రపోజల్ ను వెంకటేష్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రొడ్యూసర్ శశికాంత్ విజయ్ సేతుపతి పాత్రను నాగార్జునతో చేయించి పోలీస్ ఆఫీసర్ పాత్రను తమిళంలో చేసిన మాధవన్ తోనే తెలుగులోనూ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ వేద స్టోరీ చాలా నావెల్టీగా ఉండటంతో ప్రయోగాలంటే ఇష్టపడే నాగార్జున ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కేది చాలా తక్కువ. మంచి సబ్జెక్ట్ దొరికితే చేయడానికి సిద్ధమని హీరోలంతా చెబుతుంటారు. కథ నచ్చితే ఏ పాత్రనైనా చేసే వెంకటేష్ ఎందుకో విక్రమ్ వేదపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. వెంకటేష్ కు ఈ సబ్జెక్ట్ నచ్చి ఉంటే బాబాయ్ అబ్బాయ్ ల కాంబినేషన్ లో సినిమా చూసే ఛాన్స్ తెలుగు ప్రేక్షకులకు దక్కేది. విక్రమ్ వేద రీమేక్ ఫైనల్ గా ఎవరు చేస్తారో వేచి చూడాలి.