వేరే స్టార్ హీరో సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వెళ్ళి అక్కడ ఆ హీరో గురించి మాట్లాడాలంటే.. చాలా కొంతమంది వలనే అది జరుగుతుంది. ఈరోజు శ్రీమంతుడు సినిమా ఆడియో రిలీజ్ లో రెండుసార్లు మాట్లాడిన హీరో వెంకటేష్ అదరగొట్టేశాడు. అసలే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దోడు చిన్నోడుగా ఈ ఇద్దరూ ఇరగదీశారేమో.. ఈ స్పీచ్ కు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ''ట్రైలర్ చూశాక రెండు సైకిల్స్ కొన్నాను.. నేను కొంచెం రఫ్ గా ఉన్నాను.. చిన్నోడు మాత్రం కొంచెం స్మూత్ గా ఉన్నాడు..'' అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో ఎంతో నిజం ఉంది. ఎందుకంటే మహేష్ బాబును ఆ ఖరీదైన కార్బన్ సైకిల్ పైన చూశాక.. ఖచ్చితంగా ఎవరికైనా ఇదే ఫీలింగ్ వస్తుంది. ఇకపోతే ఈ సినిమాతో రిలీజయ్యాక మీ అందరికీ దిమ్మదిరిగిపోతుంది.. కలెక్షన్స్ అదరగొట్టేస్తాయి.. అంటూ ఫినిష్ చేశాడు వెంకీ. అందరినీ నవ్వించేశాడు.