ఒక భాషలో ఒక కథ హిట్టయితే.. ఆ కథలోని పాయింట్ అన్ని వర్గాలుకు చెందినదైతే.. ఆ సినిమాను అవకాశం ఉన్న అందరూ తీయడానికి ఎగబడతారు. ఇది ఇప్పుడు మొదలైన పద్దతి కాదులే.. పాత దేవదాసు నాటి నుండి వస్తుంది. ఇప్పుడు అలాగే ఈ ఏడాది రెండో నెలలో విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లు పొందిన హిందీ సినిమా ''జాలీ ఎల్ ఎల్ బి 2''. అక్షయ్ కుమార్ లాయర్ గా కోర్ట్ డ్రామా తో మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాని మన తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తెలుగులో మంచి కథ బలం తెలిసిన నిర్మాత రాధాకృష్ణ కాపీరైట్ తీసుకొని తెలుగు ప్రేక్షకులుకు అందించాలి అని అనుకుంటున్నారు. తన సొంత బేనర్ అయన హారిక హాసిని క్రియేషన్స్ పై నిర్మిస్తారు అని తెలుస్తుంది. అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’ కూడా తెలుగు లో వెంకటేష్ రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్షయ్ కుమార్ హీరో నటించిన జాలీ ఎల్ ఎల్ బి 2 ను తెలుగులోకి తెస్తాడట. మన తెలుగు లో రీమేక్ సినిమాలకు పెట్టింది పేరు హీరో విక్టరి వెంకటేష్ కదా.. ఈ మధ్యనే గురు సినిమా రీమేక్ కూడా చేశాడు. అలాగే త్రివిక్రమ్ మాటలు రాస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది.
ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలు సగం రీమేక్ సినిమాలే. ఖైదీ150 ధృవ ప్రేమమ్ గురు ఇలా చాలవరుకు రీమేక్ సినిమాలే. కాబట్టి ఎవరు ఈ సినిమా చేసిన హిట్టయితే పక్కా. కాకపోతే ఈ ఏడాది వచ్చిన కాటమరాయుడు.. బాబు బాగా బిజీ కూడా రీమేక్ లే. ఫ్లాపులే. చూద్దాం ఏమవుతుందో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/