బాహుబలి చిత్రం సాధించిన అపూర్వ విజయం అనితర సాధ్యం. కలెక్షన్ల పరంగాను, ప్రేక్షకుల మెప్పు పొందడంలోను, రికార్డులు తుడిచిపెట్టడంలోన దర్శకధీరుడు తీసిన బాహుబలి ఎన్నో విక్టరీలు సాధించింది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం కూడా అందుకుంది. దీంతో బాహుబలి ఖాతాలో మరో విక్టరీ నమోదైంది.
బాహుబలి సాధించిన విజయాన్ని టాలీవుడ్ సహృదయంతో స్వాగతిస్తోంది. ఆ మూవీ సాధించిన విక్టరీనీ.. విక్టరీ వెంకటేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఓ దక్షిణాది చిత్రం జాతీయ అవార్డు గెలుచుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో నాణ్యత ఉండదనే విమర్శలకు బాహుబలి చెక్ పెట్టేసింది. 'నేషనల్ బెస్ట్ పిక్చర్ - బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్స్ సాధించడం ద్వారా రాజమౌళి అండ్ టీం కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. దీన్ని దక్షిణాది సినిమా ఫాలో అవాలి' అన్నాడు విక్టరీ వెంకటేష్.
దర్శకుడు రాజమౌళి - నిర్మాతల శోభు యార్లగడ్డ - ప్రభాస్ - రాణా - అనుష్కలతోపాటు మొత్తం నటులు - టెక్నీషియన్స్ కు హార్థిక శుభాకాంక్షలు చెప్పాడు వెంకీ.