హిట్టిచ్చాడు..కానీ స్టార్ హీరోపిల‌వ‌ట్లేదా?

Update: 2023-02-24 20:19 GMT
ఈ మ‌ధ్య‌ కొంత మంది ద‌ర్శ‌కులు త‌మిళ స్టార్స్ వెంట ప‌డుతున్నారు. వారితో క‌లిసిబైలింగ్వ‌ల్ మూవీస్ చేస్తున్నారు. ఇక్క‌డ ఫ్లాప్ అయినా అక్క‌డ హిట్ అవుతుంద‌ని, రెండు భాష‌ల్లో చేస్తే ఒక‌వేళ ఫ్లాప్‌, యావ‌రేజ్ అనిపించుకున్నా నిర్మాత పెట్టిన డ‌బ్బులు తిరిగి వ‌చ్చేస్తాయి.  ఇక ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అని, ఆడియో రైట్స్ అని, ఆ త‌రువాత హిందీ రైట్స్ అని ఇలా అన్ని ర‌కాలుగా డ‌బ్బు వ‌స్తుంది. దీని వ‌ల్ల ప్రాజెక్ట్ తో పాటు నిర్మాత కూడా సేఫ్ అవుతాడు.

ఈ కాన్సెప్ట్ తో కొంత మంది టాలీవుడ్ డైరెక్ట‌ర్లు త‌మిళ స్టార్ల‌తో ద్వి భాషా చిత్రాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. మ‌న వాళ్లు త‌మిళ హీరోల వెంట ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం టాలీవుడ్ లో చాలా వ‌ర‌కు హీరోలు ఖాలీగా లేక‌పోవ‌డ‌మే. అంతే కాకుండా కొన్ని క‌థ‌ల‌ని రెండు భాష‌ల్లో చేయ‌డం వ‌ల్ల అక్క‌డ కూడా త‌మ మార్కెట్ ని విస్త‌రించుకునే అవకాశం వుంటుంది. ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ వంశీ పైడిప‌ల్లి నుంచి అనుదీప్ కె.వి వ‌ర‌కు త‌మిళ స్టార్ల‌లో సినిమాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఒక్కో సినిమా చేసినా మ‌ళ్లీ త‌మిళ హీరోల వైపే మ‌న డైరెక్ట‌ర్లు కొంత మంది చూస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రీసెంట్ గా యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ధ‌నుష్ హీరోగా `సార్‌` మూవీని రూపొందించాడు. రొటీన్ స్టోరీనే అయినా.. ముందు యావ‌రేజ్ టాక్ నే ద‌క్కించుకున్నా  వెంకీ తెర‌కెక్కించిన విధానం, క‌థ‌ని న‌డిపించిన తీరు `సార్‌`ని హిట్ అనిపించింది. ద‌ర్శ‌కుడిగా వెంకీ అట్లూరికి తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఇదిలా వుంటే వెంకీ అట్లూరి మ‌రోసారి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం త‌మిళ ఇండ‌స్ట్రీ వైపే చూస్తున్నాడ‌ట‌. తెలుగులో వున్న హీరోలంతా వ‌రుస ప్రాజెక్ట్ ల‌తోబిజీగా వుండ‌టంతో వెంకీ అట్లూరి మ‌ళ్లీ త‌మిళ హీరో కోస‌మే చూస్తున్నాడ‌ని తెలుస్తోంది. `సార్` సినిమా రిలీజ్ కు ముందే నిర్మాత‌ల‌కు టేబుల్ ప్రాఫిట్ ని అందించ‌డంతో మ‌రో సారి వెంకీ అట్లూరితో సినిమా చేయ‌డాన‌కి రెడీ అవుతున్నార‌ట‌. ఇది కూడా త‌మిళ హీరోతో అని తెలుస్తోంది.  

ఇంత‌కీ త‌మిళంలో వెంకీ అట్లూరి ఏ హీరోతో త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌బోతున్నాడు? .. ప్రాజెక్ట్ ఎలా వుండ‌బోతోంది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు తెలుస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News