ఆ కథ వెనుక ఆంధ్ర-తెలంగాణ బోర్డర్

Update: 2018-01-30 04:15 GMT
ఈ రోజుల్లో చాలావరకు సినిమాలు తెరకెక్కిన విధానం చూస్తుంటే ఇలాంటి కథలు చాలా చూశాం అనే విధంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా వరకు కథలలో ఎదో ఒక పాయింట్ ఇతర కథలకు మ్యాచ్ అవుతూనే ఉంటుంది. పూర్తిగా కొత్తదనం ఉన్న కథలు రావడం అంటే చాలా కష్టమా అని అనిపిస్తోంది. ఆ తరుణంలో కొందరు దర్శకులు మన చుట్టూ జరిగే నిజజీవిత పరిస్థితుల  ఆధారంగా కథలను అల్లుతున్నారు. ఏ మాత్రం వివాదాలకు అవకాశం ఇవ్వకుండా పెన్నుతో తమ సత్తా చాటేస్తున్నారు.

అదే తరహాలో ప్రస్తుతం ఛలో సినిమా కూడా  తెరకెక్కిందా అని కొందరిలో అనుమానాలను కలిగిస్తోంది. టీజర్ అండ్ ట్రైలర్ ని బట్టి సినిమా రెండు రాష్ట్రాల మధ్య ఉండే వివాదం అని తెలుస్తోంది. ఆంద్రప్రదేశ్ - తమిళనాడు సరిహద్దులో ఉన్న రెండు ప్రాంతాలకు మధ్య వివాదం ఈ సినిమాలో అసలు పాయింట్. అయితే దర్శకుడు ఈ లైన్ ను తెలంగాణా - ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆధారంగా రాసుకున్నాడా అనే పాయింట్ గట్టిగా వినిపిస్తోంది. దీని గురించి మాట్లాడిన డైరక్టర్ వెంకీ కుడుముల.. రెండు రాష్ట్రాల బార్డర్ ఆధారంగానే ఈ కథ తెరకెక్కిందని చెప్పాడు. కమ్మం జిల్లాకు చెందిన తను.. ఆంధ్ర ప్రదేశ్‌ బోర్డర్ కు కేవలం 2 కిమి దూరంలో ఉండేవాడట. అలా ఈ కథ ఐడియా పుట్టిందని చెప్పాడు.

రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి అనే విషయం పక్కన పెడితే.. ఆ రూట్ లో వెళితే మళ్లీ తలనొప్పులు ఎందుకని తమిళనాడు - ఆంద్ర బార్డర్ అయితే బెటర్ అని కథను బహుశా అలా మలిచాడేమో. ఏదేమైనా తప్పకుండా సినిమా లో ఈ బోర్డర్ అనే పాయింట్ బలాన్ని ఇచ్చేదే కాబట్టి దర్శకుడు కథనంలో తన పవర్ చూపించాడట. ఇప్పటికే ట్రైలర్ కి ఆడియోకి మంచి స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.


Tags:    

Similar News