‘ఛలో’ మూవీకి మూడేళ్లు.. పంచాయితీ మాత్రం ఆగలేదా?

Update: 2021-02-02 17:30 GMT
నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో 2018లో వచ్చిన చిత్రం ‘ఛ‌లో’. ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతోనే వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఇదే చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించి ఎవరో కాదు.. హీరో నాగశౌర్య తల్లి ఉషా.

అయితే.. ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజుల తర్వాత నాగ శౌర్య‌-వెంకీ కుడుముల మ‌ధ్య మనస్పర్థలు వ‌చ్చాయి. ఈ మూవీ క‌థ తనదేనని నాగ‌శౌర్య ఓ సంద‌ర్భంలో తెలిపాడు. దీంతో వెంకీ కుడుముల నొచ్చుకున్నాడు. అయితే.. అంత‌టితో ఆ వివాదం ఆగలేదు. వెంకీని త‌న కుటుంబ సభ్యునిగా భావించామ‌ని, కానీ అత‌డు మాత్రం త‌న త‌ల్లి బ‌హుమ‌తిగా ఇచ్చిన కారును అమ్మేశాడ‌ని నాగ శౌర్య అన్నాడు. దీనికి సమాధానం ఇచ్చిన వెంకీ.. తాను కారును అమ్మ‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు.

ఆ త‌రువాత‌ ఎవ‌రి సినిమాల్లో వారు బిజీ అయినప్పటికీ.. వార్ మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చింది. వెంకీ ఆ తర్వాత నితిన్‌తో ‘భీష్మ’ను తెర‌కెక్కించాడు. ఆ మూవీ కూడా మంచి విజ‌యం సాధించింది. ఇక ఈ మూవీ స‌క్సెస్ సంబ‌రాల్లో నితిన్.. నాగశౌర్య‌పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశాడు. ‘ఈ స్టోరీ వెంకీదే, నాది కాదు’ అంటూ నితిన్ కామెంట్ చేశాడు.

ఇక, లేటెస్ట్ గా మరో పరిణామం చోటు చేసుకుంది. ‘ఛ‌లో’ చిత్రం విడుద‌లై ఇవాళ్టికి మూడేళ్లు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌, హీరో నాగ శౌర్య వేర్వేరుగా ట్వీట్లు చేశారు. ఈ క్ర‌మంలో నాగ శౌర్య‌.. త‌న త‌ల్లికి కంగ్రాట్స్ చెప్పాడు. ‘అమ్మ నువ్వు ఎప్పుడూ నా సూప‌ర్‌హీరో. ఛ‌లో చేసినందుకు థ్యాంక్స్‌. నిర్మాత‌గా మూడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్ మేడ‌మ్ గారు’ అని ట్వీట్ చేశాడు శౌర్య‌.

వెంకీ కుడుముల కూడా ‘నేను ఎప్ప‌టికీ గుర్తించుకునే రోజు. మీ అంద‌రి ప్రేమ‌, ఆశీస్సుల‌కు థ్యాంక్స్’ అని కామెంట్ పెట్టాడు. అయితే.. ఈ ఇద్ద‌రు ఒక‌రిని ఒక‌రు ట్యాగ్ చేసుకోలేదు. కనీసం పేరును కూడా ప్ర‌స్తావించ‌లేదు. ఇక, వెంకీ అయితే.. మూవీ పోస్టర్ ని కూడా షేర్ చేసుకోలేదు. ఇదంతా చూసిన వాళ్లు.. వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంక కొన‌సాగుతున్నట్టే ఉందని అంటున్నారు.




Tags:    

Similar News