విక్టరీ వెంకటేష్ కెరీర్లో మరపురాని సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. అందులో వెంకీ పండించిన వినోదాన్ని తెలుగు ప్రేక్షకులెవ్వరూ అంత సులువుగా మరిచి పోలేరు. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ సీన్లో వెంకీ హావభావాలు, డైలాగులు ప్రేక్షకుల్ని ఎంతగా అలరించాయో.. అలరిస్తూనే ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని మీద ఎంతోమంది ఎన్నో పేరడీలు చేశారు. ఇప్పుడు స్వయంగా వెంకీ నే తన డైలాగ్ తో చిన్న పేరడీ చేయడం విశేషం. వెంకీ కొత్త సినిమా వెంకీ మామ రిలీజ్ విషయంలో చాన్నాళ్ల పాటు సందిగ్ధత నడవడం.. చివరికి డిసెంబరు 13న విడుదల అంటూ ఇటీవలే ప్రకటన చేయడం తెలిసిందే. ఈ నేపథ్యం లో చిత్ర బృందం ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది.
ఈ సమావేశం లో వెంకీ తన ప్రసంగాన్ని ఆరంభించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దేవుడా ఓ మంచి దేవుడా అనే డైలాగ్ ను వెంకీ అనుకరిస్తూ ప్రసంగం మొదలు పెట్టాడు. దేవుడా.. ఫైనల్‌గా నా సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేయించావు.. ఈ విషయం లో ఎంత టెన్షన్ పడ్డానో చెప్పలేను.. అంటూ చాలా ఆవేదనగా మాట్లాడుతున్నట్లు వెంకీ నటించిన తీరు అందరిలో నవ్వులు పండించింది. ఇప్పటికైనా రిలీజ్ డేట్ ఫైనల్ చేసినందుకు సురేష్ ప్రొడక్షన్స్‌కు, తన అన్నయ్య కు చాలా థ్యాంక్స్ అని వెంకీ అన్నాడు. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చిన వెంకీ.. తన మేనల్లుడు నాగచైతన్య తో కలిసి నటించిన వెంకీ మామ తన కెరీర్లో మరపురాని సినిమా అని.. ఈ చిత్రంలో చైతూ పెర్ఫామెన్స్ ఓ రేంజి లో ఉంటుందని అన్నాడు.