ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్.. రిలీజ్‌కు మధ్యలో ఇంకొక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి' హంగామా గురించి.. టికెట్ల విషయంలో నెలకొన్న హిస్టీరియా గురించి ఏమని వర్ణించాలి? తొలి రోజు సినిమా టికెట్ సాధించినవాడు ఇప్పుడు పెద్ద హీరో. లేదంటే జీరో. టికెట్ పట్టినోడికి వీరతాళ్లు వేస్తున్నారు. లేదన్నవాడిని ఈమాత్రం కూడా చేతకాదా అంటూ గాలి తీసేస్తున్నారు. ఈ అనుభవం ఇండస్ట్రీ వాళ్లకు కూడా తప్పలేదు పాపం.
గోపీమోహన్.. టాలీవుడ్‌లో స్టార్ రైటర్. బాహుబలి టికెట్ల కోసం ఆయన్ని చాలామంది ఒత్తిడి చేస్తున్నారట. అడిగినోళ్లకు టికెట్లు ఇప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. దీని గురించి ట్విట్టర్లో గోడు వెళ్లబోసుకున్నాడు గోపీ. ''ఇండస్ట్రీలో స్టార్ టైర్‌గా ఉన్నావు. బాహుబలి టికెట్లు ఇప్పించలేవా'' అంటూ జనాలు గాలి తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు గోపీమోహన్. జనాల డిమాండ్‌ను తట్టుకోలేక ఎలాగోలా టికెట్లు ఇప్పిద్దామని.. చాలామందికి ట్రై చేస్తున్నానని.. కానీ అన్ని ఫోన్లూ బిజీ అని, జనాలు దొరకట్లేదని అంటున్నాడు గోపీమోహన్.
గోపీ ట్వీట్ చూసి వెన్నెల కిషోర్ కూడా స్పందించాడు. బ్లాక్‌లో ఎలాగోలా మేనేజ్ చేసి టికెట్లు సంపాదించానని.. సింగిల్ కాల్‌తో టికెట్లు తెప్పించానని తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర బిల్డప్ ఇచ్చుకుంటున్నానని చెప్పాడు వెన్నెల కిషోర్. ఇండస్ట్రీలో ఇంత పలుకుబడి ఉన్న వాళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మామూలు జనాల గురించి చెప్పేదేముంది? బహుశా భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమా టికెట్లకు కూడా ఇంత డిమాండ్ ఉండి ఉండదు. ఈ విషయంలో కూడా బాహుబలిది రికార్డే అని చెప్పాలి.