పుట్టిన వాడు గిట్టక మానడు! ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, జీవించి ఉన్న రోజుల్లో వేసుకునే బాట.. పెట్టుకునే ఆశలు.. మనసులో చెలరేగే కోరికలను తీర్చుకునేందుకు ఈ జీవితం అనే కాన్వాస్ పై జీవుడనేవాడు తిరుగాడినంత సేపే అంటారు ప్రముఖ కవి వేటూరి! అలాంటి ఆశలు - కోరికలు తీర్చుకునే వారు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ.. కోరికలు తీరకుండానే తిరుగు పయనం కట్టి తిరిగిరాని లోకాలకు చేరుకుంటున్నవారు చాలా మంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు మనకు సినిమా నేతల నుంచి ఎదురవుతూ ఉంటాయి.
గతంలో దాసరి నారాయణరావు మరణించినప్పుడు.. ఆయనకు కూడా కొన్ని కోరికలు తీరకుండా వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఉదయం పత్రికను తిరిగి తీసుకురావాలని మల్టీ స్టారర్ మూవీ చేసైనా.. మోహన్ బాబుకు కుమారులు ఇద్దరికీ లైఫ్ ఇవ్వాలని ఆయన భావించారు. అదే సమయంలో తన కుమారుడు అరుణ్ ను కూడా అభివృద్ధిలోకి తేవాలని భావించారు. కానీ, సాధించలేక పోయారు. ఇక, ఇప్పుడు ఇదే సినీ రంగానికి చెందిన కమెడియన్ వేణు మాధవ్ కూడా తీరని కోరికతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
సినిమాల్లోకి రాకముందే టీడీపీ ఆఫీసులో కొన్నాళ్ల పాటు పని చేసిన వేణుమాధవ్ కు రాజకీయాల్లోనూ రాణించాలనే ఆకాంక్ష ఉండేది. టీడీపీ తరపున పలు కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. తన సొంత ఊరు కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వేణుమాధవ్ ఎంతగానో ప్రయత్నించారు. 2014లో కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్... ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
అయితే ఆ తరువాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన వేణుమాధవ్... క్రమంగా రాజకీయాలకు - టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు. చివరకు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న తన కోరిక తీరకుండానే కన్నుమూశారు. ప్రస్తుతం ఈవిషయం తెలుగు సినీ రంగంలో విషాద చర్చగా మారిపోయింది.