వకీల్‌ సాబ్‌ ముచ్చట్లు చెప్పిన డైరెక్టర్‌

Update: 2020-04-21 09:50 GMT
బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌ తో పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. రెండు సంవత్సరాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ను వకీల్‌ సాబ్‌ చిత్రంతో చూస్తామని ఫ్యాన్స్‌ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో కరోనా వైరస్‌ ఎటాక్‌ అయ్యి అభిమానుల ఆశలపై నీళ్లు జల్లింది. లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. మే నెలలో వకీల్‌ సాబ్‌ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేలిపోయింది. ఆగస్టులో అయినా ఈ సినిమాను విడుదల చేస్తారనే ఆశతో ఫ్యాన్స్‌ ఉన్నారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను దర్శకుడు వేణు శ్రీరామ్‌ మీడియా తో షేర్‌ చేసుకున్నాడు.

ఇంగ్లీష్‌ దిన పత్రికతో వేణు శ్రీరామ్‌ మాట్లాడుతూ... పవన్‌ కళ్యాణ్‌ గారి హార్డ్‌ వర్క్‌ అద్బుతం. ఉదయం విజయవాడ వెళ్లి పోయి సాయంత్రంకు హైదరాబాద్‌ తిరిగి వచ్చే వారు. రాత్రంతా కూడా షూటింగ్‌ లో ఫుల్‌ ఎనర్జి తో పాల్గొనే వారు. ఇతరులు ఎవరు ఆ స్థాయిలో హార్డ్‌ వర్క్‌ చేయక పోవచ్చు అనిపించింది. లేడీ ఓరియంటెడ్‌ సినిమా అయినా హీరోకు సంబంధించిన టైటిల్‌ పెట్టడంపై దర్శకుడు స్పందిస్తూ ఫ్యాన్స్‌ ఇంకా ప్రేక్షకులను ఆకర్షించేందుకు అలాంటి టైటిల్‌ ను పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇక ఈ చిత్రంలో శృతి హాసన్‌ గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయమై దర్శకుడు వేణు శ్రీరామ్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ అయిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ గారు.. శృతి హాసన్‌ లపై ఒక రొమాంటిక్‌ సాంగ్‌ ను చిత్రీకరించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు మరో నెల రోజుల పని ఉందని.. దాంతో సినిమా అంతా పూర్తి అవుతుందని పేర్కొన్నాడు. ఈ చిత్రంను దిల్‌ రాజు నిర్మిస్తు ఉండగా కీలక పాత్రలో నివేధా థామస్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Tags:    

Similar News