కత్రినా కైఫ్ బాలీవుడ్ లో అగ్ర కథానాయిక. గ్లామర్ పాత్రలతోనూ ఆకట్టుకుంటూనే.. ప్రత్యేక పాటల్లో అదిరిపోయే నర్తనతో కుర్రకారు బాడీలో హీట్ పుట్టించడం తనకే చెల్లింది. అదే సమయంలో యాక్షన్ తరహా పాత్రలతోనూ మెస్మరైజ్ చేస్తుంది. గడిచిన రెండు దశాబ్ధాల కెరీర్ లో ఫ్యాన్స్ కే కాదు కామన్ జనాలకు విందు పసందు పంచుతూనే ఉంది. ఇదంతా కెరీర్ మ్యాటర్. కానీ పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం కత్రిన డిజాస్టర్ అనే చెప్పాలి. ఈ బ్యూటీ ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యింది. తనకు లైఫ్ ఇచ్చిన కండల వీరుడు సల్మాన్ తో చాలా రోజుల పాటు డేటింగ్ చేసింది. తామిద్దరం ప్రేమలో ఉన్నట్టు బహిరంగంగానే అంగీకరించిన ఈ జోడీ.. కొన్ని సంవత్సరాల తర్వాత బ్రేకప్ అయ్యారు. అటుపై కత్రిన ఒంటరి అయ్యింది.
సల్మాన్ నుంచి విడిపోయిన తర్వాత కొద్ది రోజులకే కత్రిన మరో తోడుని వెతుక్కుంది. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ప్రేమలో పడింది. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలం చర్చనీయాంశంగా మారింది. పెళ్ళి వరకు వెళ్తుందనే వార్తలు వచ్చాయి. రణ్‌బీర్- కత్రినా బెస్ట్ లవ్ కపుల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇంతలో అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరు విడి పోయారు. ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారట. అప్పట్నుంచి ఇప్పటి వరకు క్యాట్(కత్రినా) సింగిల్ గానూ బ్యాచ్ లర్ జీవితాన్ని గడుపుతూ వచ్చింది.
కానీ ఈ ఒంటరి తనాన్ని వేగలేక తిరిగి మరో తోడుని వెతుక్కుంది ఈ బ్యూటీ. ఈ వార్త ఇటీవల బాలీవుడ్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో వేడెక్కిస్తోంది. తనకంటే వయసులో చాలా చిన్న వాడైన.. యంగ్ హీరో విక్కీ కౌశల్‌తో కత్రినా డేటింగ్ చేస్తోందని ప్రచారమవుతోంది. ఈ ఇద్దరూ కలిసి నటించే క్రమంలో ప్రేమలో పడ్డారని గుసగులు మొదలయ్యాయి. ఇప్పటికే వీరిద్దరు పలు పార్టీల్లో చనువుగా కనిపించడంతో ముంబై మీడియా ఈ జంట లవ్ ని కన్ఫామ్ చేసేసింది.
తాజాగా భారతీయ సంపన్నుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ముందస్తు హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ హోలీ వేడుకలో కత్రినా- విక్కీ కౌశల్ జంటగా హాజరయ్యారు. అంతేకాదు హోలీలో రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు. హోలీ పండుగని సాటి స్టార్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఈ లవ్ బర్డ్స్ ప్రేమ వ్యవహారంపై క్లారిటీ వచ్చేసిందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ జోడి పెళ్ళి వరకు వెళ్తుందా? 'సినిమాల్లో ఇవన్నీ కామన్' అనుకునేలా బ్రేకప్ తో చెక్ పెట్టేస్తారా? అనేది చూడాలి. ఇటీవల తమ లవ్ స్టోరీ పై వచ్చిన వార్తల విషయంలో స్పందిస్తూ 'నా జీవితం అంతా ఓపెన్. ఏదీ దాచుకోవాల్సిన అవసరం లేదు. ఈ వార్తలపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో అబద్దం చెప్పాల్సిన పనిలేదు' అని విక్కీ తెలివైన ఆన్సర్ ఇచ్చాడు. ``సెలబ్రిటీ లైఫ్ లో ఇలాంటి వార్తలు కామన్. నాలో ఇప్పుడు చాలా మెచ్యూరిటీ వచ్చింది. దీనిపై స్పందించను`` అని కత్రినా వెల్లడించడం విశేషం.
కత్రినా ప్రస్తుతం 'సూర్యవంశీ' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. `ఆంగ్రేజీ మీడియం' ప్రత్యేక పాటలో ఆడి పాడుతోంది. ఇక విక్కీ కౌశల్ 'సర్దార్ ఉద్దమ్ సింగ్` అనే చిత్రంలో నటిస్తున్నారు.