ఫలక్ నుమా దాస్ లాంటి మాస్ సినిమాలో నటించాడు విశ్వక్ సేన్. గల్లీ బోయ్.. మాస్ బోయ్ తరహా పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత విశ్వక్ ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు విశ్వక్ మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు.. అతడి పాలిట దేవుడిగా మారుతున్నాడు విక్టరీ వెంకటేష్. ఇంతకీ ఏమా ఇంట్రెస్టింగ్ స్టోరి? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
విశ్వక్ సేన్ కథానాయకుడిగా తమిళ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం 'ఓ మై కడవులే' తెలుగులో రీమేక్ అవుతోంది. ఈ చిత్రానికి మాతృక దర్శకుడు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్ - మిథిలా ఫాల్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఒరిజినల్ లో వాస్తవానికి విజయ్ సేతుపతి దేవుడి గా అతిధి పాత్రను పోషించాడు. జీవితంలో తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రధాన పాత్రకు రెండవ అవకాశం ఇచ్చే దేవుడిగా కనిపించాడు. ఇక్కడ తెలుగు వెర్షన్ లో వెంకటేష్ అదే పాత్రను తిరిగి పోషిస్తున్నారు. వెంకీ భాగం షూటింగ్ సాగుతోందని సమాచారం.
యువహీరో పెద్ద హీరో అనే భేషజానికి పోకుండా వెంకీ లాంటి స్టార్ హీరో అందరికీ సహకారం అందించడం అతడిలో స్పోర్టింగ్ స్పిరిట్ కి మంచితనానికి నిదర్శనం. తెలుగులో ఈగోలెస్ హీరోగా అతడికి ఎంతో గౌరవం ఉంది.
ఇంతకుముందు గోపాల గోపాల చిత్రంలో తాను సామాన్యుడిగా నటిస్తే.. దేవుడి పాత్రలో పవన్ కల్యాణ్ నటించారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడి(గోపాలుడు)గా అద్భుత నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తెరపై పవన్- వెంకటేష్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటైంది. ఇప్పుడు సామాన్య యువకుడైన విశ్వక్ సేన్ తో దేవుడు వెంకటేష్ పాత్ర ఏ రేంజులో పండనుందో చూడాలి.
నేటితరం గొప్పగా ఎదగాలని కోరుకునే హీరోల్లో వెంకటేష్ ముందుంటారు. అందరితో ఎంతో సులువుగా కలిసిపోతూ తన అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఇతరులకు కల్పిస్తారు. ఇంతకుముందు గోపాల గోపాల సెట్స్ లో వెంకీ నుంచి ఆధ్యాత్మిక విధానం పరంగా చాలా నేర్చుకున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ కి గురూ వెంకీ నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.