టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. టాలీవుడ్ స్థాయిని భారతావనికి పరిచయం చేసిన నటుడు నందమూరి తారకరామారావు గారి జీవితం గురించి అందరికి తెలిసిందే అయినా కూడా ఇంకా తెలియని జీవితాన్ని ఏమైనా చూపిస్తారా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఆ నిజాలు ఎంతవరకు తెరపై ఆవిష్కృతం అవుతాయో గాని దర్శకుడు క్రిష్ మాత్రం తన స్టైల్ ఎమోషన్ ని ఏ మాత్రం మిస్ చేయడు అని చిత్ర యూనిట్ ద్వారా తెలిసింది.
అయితే ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర బసవతారకం. ఎన్టీఆర్ సతీమణి అయిన ఆమె క్యారెక్టర్ లో బాలీవుడ్ అందాల తార విద్యా బాలన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే కొంచెం యవ్వనంగా కనిపించాలని విద్యా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్యారెక్టర్ గురించి దర్శకుడు క్రిష్ ఆమెకు క్లియర్ గా మెన్షన్ చేశాడు. అందుకు తగ్గట్టుగా విద్యా బాలన్ మారుతోంది. రీసెంట్ గా అంబానీ వివాహ వేడుకలో విద్యా కొంచెం కొత్తగా మారిందని అందరూ పొగిడేశారట. ఇకపోతే ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
జూన్ 5 నుంచి మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. పాత్రలకు సంబంధించిన పనులు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మరి దర్శకుడు క్రిష్ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో చూడాలి. బాలకృష్ణ కూడా తండ్రి పాత్ర కోసం కొంచెం ఫిట్ నెస్ లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎమ్.ఎమ్. కీరవాణి ఈ బయోపిక్ కు సంగీతం అందించనున్నారు.