స‌రోగ‌సీ వివాదంపై విఘ్నేష్ శివ‌న్ స్మార్ట్ రిప్లై!

Update: 2022-10-12 12:17 GMT
న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ దంప‌తులు ఆదివారం అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన విష‌యం తెలిసిందే. తాము త‌ల్లిదండ్ర‌లైన‌ట్టుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించి త‌మ ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. అంతే కాకుండా మాకు ఇద్ద‌రు ట్విన్ బాయ్స్ జ‌న్మించార‌ని, త‌మ పిల్ల‌ల‌ని ఆశీర్వ‌దించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు క‌ల‌వ‌ల పాదాల‌ని న‌య‌న్‌, విఘ్నేష్ శివ‌న్ ముద్దాడుతున్న ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకున్నారు.

జూన్ 9న ఇరు కుటుంబాల పెద్ద‌ల అంగీకారంతో ఒక్క‌టైన ఈ జంట నెల‌లు తిర‌క్కుండానే త‌ల్లిదండ్రులు కావ‌డం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స‌రోగ‌సీ విధానంలో ఈ జంట క‌వ‌ల‌ల‌కు జ‌న‌క్మినిచ్చారంటూ వార్తలు గుప్పుమ‌ర‌డంతో దీనిపై దుమారం మొద‌లైంది. స‌రోగ‌సీ విధానంలో పిల్ల‌ల‌ని క‌న‌డం అనేది చ‌ట్ట‌ప‌రంగా నేర‌మంటూ కోలీవుడ్ న‌టి క‌స్తూరి సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్ట‌డంతో వివాదం రాజుకుంది.

ఇదే గ‌న‌క రుజువైతే న‌య‌న దంప‌తుల‌కు శిక్ష‌, భారీ జ‌రిమానా త‌ప్ప‌తంటూ చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. త‌మిళ‌నాట ఈ వివాదం ముదురుతున్న నేప‌థ్యంలో న‌య‌నతార భ‌ర్త‌, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇచ్చిన స్మార్ట్ రిప్లై ఇప్ప‌డు వైర‌ల్ గా మారింది.

'నిన్ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ నీతోనే వుండి నీకు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకునే వారి గురించే ఆలోచించు. ఎందుకంటే వాళ్లే నీ వాళ్లు. ఎప్ప‌టికీ ఇదే వాస్త‌వం. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా అన్నీ నిన్ను చేర‌తాయి.

అప్ప‌టి వ‌ర‌కు స‌హ‌నంతో వేచి వుండు. ప్ర‌తి క్ష‌ణాన్ని ఆస్వాదించు' అని రాసుకొచ్చాడు. విఘ్నేష్ శివ‌న్ త‌మ సంతానంపై వ‌స్తున్న కామెంట్ ల‌పై ఇలా స్మార్ట్ గా రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే జూన్ లో వివాహం చేసుకున్న ఈ జంట అప్పుడే క‌ల‌వ‌ల పిల్ల‌ల‌ని ఎలా క‌న్నారంటూ త‌మిళ‌నాట అనుమానాలు మొద‌ల‌య్యాయి. అంతే కాకుండా న‌య‌న్ - విఘ్నేష్ శివ‌న్ ల జంట స‌రోగ‌సీ ద్వారానే సంతానాన్ని క‌లిగిందన్న వార్త‌లు కూడా జోరందుకున్నాయి.

ఈ వార్త‌ల‌పై స్పందించిన త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్ర‌మ‌ణియ‌న్ త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో న‌య‌న్ - విఘ్నేష్ శివ‌న్ ల జంటని వివ‌ర‌ణ కోర‌తామ‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విఘ్నేష్ శివ‌న్ తాజా పోస్ట్ పై త‌మిళ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి అని నెటిజ‌న్ లు వాపోతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News