నయనతార పెళ్లి .. నిరంతరం హాట్ టాపిక్. ప్రియుడు విఘ్నేష్ శివన్ ని నయన్ పెళ్లాడేస్తోందని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. ఇంతకుముందు గుడిలో సీక్రెట్ గా పెళ్లాడేసారని ప్రచారం సాగింది. కానీ ఏదీ నిజం కాలేదు. నయన్ కానీ.. విఘ్నేష్ కానీ తమ పెళ్లి గురించి ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేదు.
అయితే మరోసారి ఈ జంట పెళ్లిపై ఓ రూమర్ జోరుగా షికారు చేస్తోంది. అదేమంటే.. ఓ పురాతన గుడిలో పెళ్లికి రెడీ అవుతున్నారని అంతకుముందే నయన్ ఓ భారీ హోమం నిర్వహించనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఇది నిజమా? అని విఘ్నేష్ ని ప్రశ్నిస్తే.. కేవలం పుకార్ మాత్రమేనని కొట్టి పారేసాడు.
ఎవరికి వారు సొంత వ్యాపకాలతో బిజీగా ఉన్నాం. నేను దర్శకుడిగా బిజీ. నయన్ నటనలో బిజీ. ఇప్పట్లో పెళ్లికి టైమ్ లేదు. నిరూపించుకోవాల్సింది చాలా ఉంది!! అంటూ తెలిపాడు. నయనతార సహా కాజల్.. త్రిష పెళ్లి పైనా రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏది రూమర్ .. ఏది నిజం? అన్నదానిపై సరైన క్లారిటీ దొరకడం లేదు.