నయన్ కు రావడంతో.. అతను ఫుల్ ఖుష్‌

Update: 2018-06-04 04:36 GMT
ఈతరం హీరోయిన్లలో నటనాపరంగా చూసుకుంటే గ్యారంటీగా ముందుండేపేరు నయనతారది. కమర్షియల్ గా హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్న నయనతార అప్పుడప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ కనిపించి అవార్డులు కొల్లగొట్టేస్తుంటుంది.

ఈమధ్య నయనతార అరమ్ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గానటించింది. ఈ సినిమా తెలుగులో కర్తవ్యం పేరుతో డబ్ అయింది. ఇందులో ఆమె జిల్లా కలెక్టర్ పాత్రలో నటించింది. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలో  నయనతార నటన అద్భుతంగా ఉందని అంతటా ప్రశంసలొచ్చాయి. తాజాగా ఈ మూవీలో నయన్ నటనకు స్టార్ విజయ్ అవార్డులు అందజేసింది. ఈ సందర్భంగా నయన్ బాయ్ ఫ్రెండ్ - డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెగ ఎగ్జయిట్ అయిపోయాడు. ‘‘నయనతారా.. నిన్ను చూసి గర్వపడుతున్నా. దూసుకుపో.. హృదయాలను గెలుచుకుంటూ మున్ముందుకు సాగిపో. అరమ్ నిజాయతీగా.. గట్టి కృషితో చేసిన ప్రయత్నం.  ఈ సినిమా అన్ని ప్రశంసలకు అర్హమైనది. ఎంటైర్ టీమ్ కు అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశాడు.

నయనతార - విఘ్నేష్ శివన్ లు తమ బంధం గురించి పెదవి విప్పి చెప్పిందే లేదు. అలాగని దాచిపెట్టుకోవడమూ లేదు. నయన్ ను మెచ్చుకునే ఏ సందర్భంలోనూ విఘ్నేష్ శివన్ బాగానే రియాక్ట్ అవుతుంటాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువ రియాక్ట్ అయాడు. ఫుల్ ఖుష్‌ అంటూ పండగ చేసుకుంటున్నాడు.
Tags:    

Similar News