గత కొన్ని రోజులుగా దర్శకుడు ఏఎల్ విజయ్.. హీరోయిన్ అమలా పాల్ ల విడాకుల న్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ విడిపోవడంతో విజయ్ తండ్రి ఓపెన్ గానే చెప్పేశాడు. హీరోయిన్ గా ఇంకా అమల కంటిన్యూ అవడంతోనే విడాకులు అనే అర్ధం వచ్చేలా ఈ డైరెక్టర్ ఫాదర్ చెప్పడంతో.. భార్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాడంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వీటికి సమాధానం ఇచ్చేందుకు ఓ ఓపెన్ లెటర్ రాశాడు ఏఎల్ విజయ్.
'నేను అమల విడిపోవడంపై చాలానే న్యూస్ చదువుతున్నాను. ఇవన్నీ తప్పుడు సమాచారంతో వేసుకున్న అంచనాలు మాత్రమే. వీటన్నిటిలో విడిపోవడం ఒక్కటి తప్ప మిగతావన్నీ అబద్ధాలే. మేమిద్దరం విడిపోవడానికి కారణం నాకు తప్ప మరెవరికీ తెలీదు. చాలామంది నా స్నేహితులు వెల్ విషర్స్.. ఇండస్ట్రీ పెద్దలు మీడియా ముందుకొచ్చి మాట్లాడమన్నారు. నా ప్రైవేటు లైఫ్ ని పబ్లిక్ లో డిస్కస్ చేయడం ఇష్టంలేక దీనికి దూరంగా ఉన్నాను. నా జీవితంలో జరుగుతున్న సంఘటనలపై బాధ పడ్డ నా తండ్రి.. తన నిరుత్సాహాన్ని నాతో చెప్పడమే కాకుండా.. ఓ మీడియా ఛానల్ తో కూడా పంచుకున్నారు. అంతే అప్పటినుంచి ఊహాగానాలు మొదలైపోయాయి'.
'నాకు సామాజిక బాధ్యత ఉంది. నేను 9 సినిమాలు డైరెక్ట్ చేశాను. వీటిలో మహిళల గౌరవాన్ని భంగం కలిగించేలా ఒకటి కూడా ఉండదు. పైగా వారిపై ఎంతో గౌరవాన్ని చూపేలా ఉంటాయి. మహిళలకు స్వేచ్ఛ అనే అంశంపై నేను వారి తరఫునే వాదిస్తాను. మా పెళ్లయిన తర్వా కూడా అమల సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నపుడు నేను వీలైనంతవరకూ తనను సమర్ధించాను. తనను సినిమాల్లో చేయద్దంటూ నేను కానీ నా కుటుంబం కాని ఇబ్బంది పెట్టామనే ఆరోపణలను ఖండిస్తున్నాను'.
'వైవాహిక అనుబంధానికి నిజాయితీ నమ్మకాలే పునాది. అవి బద్దలైపోయినపుడు బలవంతపు అనుబంధాన్ని కొనసాగించడంలో అర్దం లేదు. కాను వివాహ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉంది. నేను ఎప్పుడూ కలలో కూడా ఇలాంటి ముంగిపును ఊహించలేదు. కానీ నాకు ఇప్పుడు ఎటువంటి ఛాయిస్ లేదు. గుండెల్లో ఎంతో బాధగా ఉన్నా.. జీవితంలో గౌరవంగా ముందుకు సాగాలని అనుకుంటున్నా' అంటూ సుదీర్ఘంగా ఉత్తరం రాసిన అమలాపాల్ భర్త.. మీడియాపై కూడా విరుచుకు పడ్డాడు.
'మేం ఇద్దరం విడిపోయే పరిస్థితి కంటే.. అసలు వాస్తవాలను తెలియకుండా లింగ బేధాలను చూపిస్తూ మీడియాలోని ఒక వర్గం చేస్తున్న ప్రచారం ఇంకా బాధ కలిగిస్తోంది. మా జీవితాలను మాకు వదిలేసి ఎవరి పనులు వారు చేసుకుంటే నేను ఎంతో కృతజ్ఞుడిని. ఇలాంటి సమయంలో నాకు అండగా ఉన్న ఆప్తులకు ధన్యవాదాలు' అని లెటర్ లో చెప్పుకొచ్చాడు అమలాపాల్ భర్త ఏఎల్ విజయ్.