బేతాళుడు రిలీజ్ డేట్ ఇచ్చేశారు

Update: 2016-11-01 14:47 GMT
‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. డబ్బింగ్ సినిమాల చరిత్రలోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో వసూళ్లు సాధించింది ఈ సినిమా. పెట్టుబడి.. రాబడి.. పోల్చి చూస్తే తెలుగు సినిమా చరిత్రలలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలుస్తుంది ‘బిచ్చగాడు’. అలాంటి హిట్టు తర్వాత విజయ్ ఆంటోనీ నటిస్తున్న సినిమా కావడంతో ‘బేతాళుడు’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం దీపావళికే విడుదల కావాల్సింది. ఐతే కాష్మోరా.. కోడి (ధర్మయోగి) లాంటి సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేశారు. ఇప్పుడీ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

నవంబరు 18న ‘బేతాళుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు తమిళ వెర్షన్ ‘సైతాన్’ కూడా విడుదలవుతుంది. దీని కంటే ముందు నవంబరు 3న ‘సైతాన్’ ఆడియో వేడుక చెన్నైలో జరుగుతుంది. మూడు రోజుల తర్వాత ‘బేతాళుడు’ ఆడియో వేడుకను హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ‘బేతాళుడు’ మీద మంచి అంచనాలున్న నేపథ్యంలో తెలుగు ఆడియో వేడుకను కొంచెం ఘనంగానే చేసి.. సినిమాను బాగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి విజయ్ ఆంటోనీ చెబుతూ.. ‘‘నేనిందులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్ర చేస్తున్నా. ఆ పాత్రలో చాలా డెప్త్ ఉంటుంది. నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలని నా కోరిక. నేనిప్పటిదాకా చేసిన పాత్రలన్నింటికీ ఇది భిన్నమైంది. ‘బిచ్చగాడు’ సక్సెస్ తర్వాత నా సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. ‘బేతాళుడు’ ఆ అంచనాల్ని తప్పకుండా అందుకుంటుంది’’ అని చెప్పాడు.
Tags:    

Similar News