‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో తిరుగులేని గుర్తింపు సంపాదించాడు విజయ్ ఆంటోనీ. తమిళంలో స్టార్ ఇమేజ్ లేకపోయినా.. తెలుగులో ఇలాంటి ఫాలోయింగ్ రావడం అరుదైన విషయం. కానీ ఆ పాపులారిటీ, ఫాలోయింగ్‌ను విజయ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోనీ నుంచి నాలుగు సినిమాల దాకా వచ్చాయి కానీ.. అవన్నీ తుస్సుమనిపించాయి. ముఖ్యంగా చివరగా విజయ్ నుంచి వచ్చిన ‘ఇంద్రసేన’ అతడిపై ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు తెలుగులో అతడి మార్కెట్ దాదాపుగా నిల్ అయిపోయింది. అందుకేనేమో తన కొత్త సినిమా ‘కాళి’ని తెలుగులో తెద్దామా వద్దా అనే సందేహంలో ఉన్నట్లున్నాడు విజయ్.
విజయ్ గత మూడు సినిమాలకు చాలా ముందుగానే తెలుగులోనూ బిజినెస్ అయిపోయింది. తమిళంతో పాటే తెలుగులోనూ డబ్బింగ్ కార్యక్రమాలు చేశారు. ప్రమోషన్లు కూడా చేశారు. కానీ ‘కాళి’ విషయలో అలా చేయట్లేదు. ఈ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తమిళం వరకే సోలోగా ప్రమోషన్లు చేశారు. ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఈ చిత్రం తెలుగులోకి రావడం డౌటే అనిపిస్తోంది. ఇక ‘కాళి’ ట్రైలర్ చూస్తే అందులో అడుగడుగునా తమిళ వాసనలు కొడుతున్నాయి. ట్రైలర్ చాలా గందరగోళంగా కూడా అనిపిస్తోంది. దీన్ని తెలుగులో రిలీజ్ చేసినా పెద్దగా ఫలితం ఉండదనుకున్నారో ఏమో.. తెలుగు డబ్బింగ్ ఊసే ఎత్తట్లేదు. చూస్తుంటే తెలుగులో విజయ్ ఆంటోనీ దుకాణం బంద్ అయినట్లే కనిపిస్తోంది.
ట్రైలర్ కోసం క్లిక్ చేయండి
Full View