తమిళంలో సంగీత దర్శకుడిగా ఉన్న విజయ్ ఆంటోనీ నటుడిగా మారదామనుకున్నపుడు అక్కడి జనాలు కూడా అతణ్ని పెద్దగా పట్టించుకోలేదు. ఐతే తొలి సినిమా ‘నాన్’తోనే తనేంటో రుజువు చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఆపై సలీమ్.. పిచ్చైకారన్ సినిమాలు సూపర్ హిట్టయి అతడిని హీరోగా నిలబెట్టాయి. ‘పిచ్చైకారన్’ సినిమా తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో రిలీజై సంచలన విజయం సాధించడంతో ఇక్కడా అతడికి తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. కానీ ఆ సినిమాతో వచ్చిన పేరును.. మార్కెట్ ను విజయ్ నిలబెట్టుకోలేకపోతున్నాడు. ‘బిచ్చగాడు’ తర్వాత వచ్చిన బేతాళుడు.. యమన్ రెండూ కూడా నిరాశపరిచాయి. ‘బేతాళుడు’ తేడా కొట్టినా.. ‘యమన్’ కచ్చితంగా బెటర్ గా ఉంటుందని జనాలు ఆశించారు. కానీ ఈసారి కూడా నిరాశ తప్పలేదు.
తమిళ హీరోలు చాలామంది ఒకట్రెండు సినిమాలతో తెలుగులో మంచి పేరు.. మార్కెట్ సంపాదించి.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయినవారే. సూర్య.. కార్తి.. విశాల్.. జీవా లాంటి హీరోలు కూడా ఆరంభంలో తమకు వచ్చిన మార్కెట్ ను నిలబెట్టుకోలేకపోయారు. వీరిలో సూర్య ఒక్కడి పరిస్థితి మాత్రమే కొంచెం మెరుగు. మరి విజయ్ ఆంటోనీ పరిస్థితి మున్ముందు ఏమవుతుందో చూడాలి. విజయ్ ఆంటోనీ తర్వాతి సినిమా అతడికి కీలకం. ఆ సినిమా ఆడితేనే అతడి మార్కెట్ నిలబడుతుంది. లేదంటే అతను కనుమరుగైపోవడం ఖాయమే. మరి ఈసారి అతడి నుంచి ఎలాంటి సినిమా వస్తుందో.. అదెలా ఆడుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/