విజయ్ ఆంటోని దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు!

Update: 2020-11-13 10:30 GMT
తమిళ నటుడు విజయ్ ఆంటోని అంటే తెలుగునాట కూడా మంచి గుర్తింపే ఉంది. ఆయన నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథా బలంతోనే సూపర్ హిట్ అయింది. స్వతహాగా విజయవంతం గొప్ప నటుడేమీ కాదు. అతడు ముందుగా మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత హీరోగా మారి మొదటి ప్రయత్నంలో డాక్టర్ సలీం అనే సినిమాని తీశాడు. అది ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత తనే నిర్మాతగా మారి డైరెక్టర్ శశి దర్శకత్వంలో బిచ్చగాడు సినిమా చేశాడు. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా రూ.51 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డు హిట్ సాధించింది. ఆ  సినిమా తెలుగులోనూ స్ట్రయిట్  సినిమా లాగా బంపర్ హిట్ సాధించింది. విజయ్ ఆంటోనినే  ఇచ్చిన మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది.  పాటలు కూడా ఊపేసాయి.

 తెలుగు తమిళ భాషల్లో మంచి ఆదరణ లభించడంతో బిచ్చగాడు సినిమాని హిందీలో కూడా డబ్ చేశారు. ఒడిశా, మరాఠా, కన్నడ భాషల్లో  రీమేక్ చేశారు.  ఆ సినిమాతో విజయ్ కి తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. నటనలో పెద్దగా ఓనమాలు తెలియని విజయ్ ఏ సన్నివేశానికైనా ఒకటే ఎక్స్ ప్రెషన్ పెడతారనే విమర్శ వుంది. ఆ సినిమా తర్వాత విజయ్ కి పెద్దగా హిట్ దక్కిన సినిమా ఏది లేదు. కానీ విజయం మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. బిచ్చగాడు తర్వాత భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌' ఇలా వరుస  పెట్టి సినిమాలు చేస్తూ వచ్చారు.

ప్రస్తుతం విజయ్‌ ఆంటోని 'మెట్రో' వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో 'కోడియిల్‌ ఒరువన్‌'. చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో 'విజయ రాఘవన్‌'గా విడుదల చేస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ మూవీని  వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు మెకర్స్  ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమా లాగా సక్సెస్  ఇస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News