విజయ్.. బాలయ్య.. రానా.. ఎవరు దొరుకుతారు?

Update: 2023-01-21 00:30 GMT
తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్ లను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయగా... రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. మూడవ సీజన్ నుండి వరుసగా నాలుగు సీజన్ లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. మధ్య లో ఒక ఓటీటీ సీజన్ కు కూడా నాగ్‌ హోస్టింగ్‌ చేయడం జరిగింది.

అయిదు సీజన్ ల బిగ్ బాస్ కు హోస్టింగ్ చేసిన నాగార్జున కొత్త సీజన్‌ విషయంలో ఆసక్తి కనబర్చడం లేదట. ఇప్పటికే నాగార్జున బిగ్ బాస్ నిర్వాహకులకు ఆ విషయాన్ని తెలియజేడంతో వారు కొత్త హోస్ట్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు అనేది జోరుగా సాగుతున్న ప్రచారం.
 
తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త హోస్ట్‌ ను ఎంపిక చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మరో వైపు అన్ స్టాపబుల్‌ టాక్ షో తో హోస్ట్‌ గా మంచి పేరు దక్కించుకున్న బాలయ్య ను కూడా బిగ్ బాస్ హోస్ట్‌ పోస్ట్‌ కు పరిశీలిస్తున్నారట.

విజయ్‌ దేవరకొండ మరియు బాలయ్య ల్లో ఏ ఒక్కరు కూడా ఇంట్రెస్ట్‌ చూపించకుంటే రానా ను థర్డ్‌ ఆప్షన్‌ గా బిగ్‌ బాస్‌ నిర్వాహకులు పెట్టుకున్నారట. మొత్తానికి ఈ షో యొక్క కొత్త  హోస్ట్‌ పోస్ట్‌ కు ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు ఓకే చెప్తారు అనేది ఆసక్తిగా మారింది.

హిందీ బిగ్ బాస్ కు సుదీర్ఘ కాలంగా సల్మాన్‌ ఖాన్ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నాడు. భారీ ఎత్తున పారితోషికం ఇస్తున్న కారణంగా సల్మాన్ ఖాన్ కంటిన్యూ అవుతున్నాడు. తెలుగు లో కూడా భారీ గా పారితోషికం ఇస్తున్నా కూడా నాగార్జున పలు కారణాల వల్ల బిగ్ బాస్ ను వదిలేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

సీజన్‌ ప్రారంభంకు కొన్ని వారాల ముందు హోస్ట్‌ విషయంలో నిర్వాహకులు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News