అభిమానులకు దగ్గరవ్వాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. కానీ అది అంత ఈజీ కాదు. అభిమానుల ప్రేమను తట్టుకోవాలన్నా కూడా అందుకు సిద్ధంగా ఉండాలి. అది చాలా కష్టం. అయితే మాటలతోనే ఫ్యాన్స్ అను ఎట్రాక్ట్ చేసే హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. సింపుల్ గా ఉంటూ లో లెవెల్లో మాట్లాడుతూనే బలే ఆకట్టుకుంటాడు. ఇక ఈ సారి ఫిల్మ్ ఫెర్ కు మనోడు బెస్ట్ యాక్టర్ గా నామినేట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఇటీవల విజయ్ తన స్టైల్ లో చెప్పాడు.
అలాగే ఒక అభిమానిని కూడా తనతో పాటు తీసుకెళతాని విజయ్ తెలిపాడు. ఇకపోతే నామినేట్ అయిన విషయం గురించి మాట్లాడుతూ.. చిరు సర్ - వెంకీ సర్ అండ్ బాలయ్య బాబు ఎంత పెద్ద స్టార్స్ మన ఫిల్మ్ ఇండస్ట్రీకి. న్యూ జనరేషన్ తారక్ బయ్యా ప్రభాస్ అన్నా ఉన్నారు. ఇక నేను నెక్స్ట్ జనరేషన్. వాళ్ల ముందు బచ్చగాడిని వారితో పాటు ఫిల్మ్ ఫెర్ అవార్డు కోసం నామినేట్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉందని విజయ్ వివరించాడు. ఇక ఫిల్మ్ ఫెర్ వేడుక కోసం ఒక అభిమానిని తీసుకెళతాను అని విజయ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
ఇక 65 వ ఫిలింఫేర్ పురస్కారాలలో (తెలుగు) ఉత్తమ నటుడిగా నామినేషన్లు ఈ ఏడాది అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి. బాలకృష్ణ (గౌతమి పుత్ర శాతకర్ణి) - ప్రభాస్ (బాహుబలి 2) - జూనియర్ ఎన్టీఆర్ (జై లవ కుశ) - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) పోటీలో ఉన్నారు. మరి వీరందరిలో చివరికి ఉత్తమ కథానాయకుడు అవార్డు ఎవరికీ దక్కుతుందో చూడాలి.