మాస్ ని ఆకట్టుకోవడం ఎలానో విజయ్ దేవరకొండకు తెలిసినంతగా వేరొకరికి తెలీదేమో. సందర్భాన్ని బట్టి ప్రచారంలో వైవిధ్యం కోసం తపించే ఎనర్జిటిక్ హీరోగా దేవరకొండ పేరు మార్మోగుతోంది. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ అంతటి ఎనర్జీని చూపిస్తూ విజయ్ టాలీవుడ్ లో సరికొత్త వేవ్స్ క్రియేట్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న డియర్ కామ్రేడ్ ఈవెంట్ లో సర్ ప్రైజ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. కామ్రేడ్ స్పీచ్ లోనూ ఎంతో వైవిధ్యం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది.
తాజాగా బెంగళూరులో జరిగిన డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ లోనూ దేవరకొండ అభిమానులకు అదిరిపోయే ట్రీటిచ్చాడు. విజయ్ - రష్మిక జోడీ వేదికపై అద్భుతమైన డ్యాన్సింగ్ ట్రీట్ ఇచ్చింది. బంగారువర్ణం డిజైనర్ డ్రెస్ లలో చూడముచ్చటైన ఆ జంట అహూతుల్ని మైమరిపించింది. విజయ్ గోల్డ్ కలర్ లాల్చీలో కనిపిస్తే దానికి కాంబినేషన్ గా రష్మిక సైతం గోల్డ్ కలర్ శారీలో మైమరిపించింది. ఆ ఇద్దరూ వేదికపై ఒకరితో ఒకరు పోటీపడుతూ మాస్ స్టెప్పులతో రక్తి కట్టించారు. డ్యాన్సర్ల బృందం రష్మికను తమ భుజాలపైనే మోసుకుని వచ్చి వేదికపై దించి వెళితే అటుపై విజయ్ తో కలిసి డ్యాన్సుల్లో మునిగిపోయింది. ఆ దృశ్యం విజయ్- రష్మిక అభిమానులకు కన్నుల పండుగ అనే చెప్పాలి. ఈ ఈవెంట్ లో కన్నడ స్టార్ యశ్ ముఖ్య అతిధిగా అలరించారు. బెంగళూరు తరవాత చెన్నయ్.. హైదరాబాద్ లోనూ ఈ తరహా మ్యూజిక్ ఫెస్టివల్స్ ని టీమ్ ప్లాన్ చేస్తోంది.
మొత్తానికి ప్రచార వైవిధ్యంతో ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు కర్నాటకలోనూ డియర్ కామ్రేడ్ కి క్రేజు పెంచేస్తున్నారు. ఇప్పటికే డియర్ కాడ్రేడ్ టీజర్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. గీత గోవిందం తర్వాత మళ్లీ ఈ జోడీ ఎలాంటి రిజల్ట్ ని అందుకోబోతున్నారు? అన్నది వేచి చూడాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించారు.