అయన్ రాండ్ రష్యాలో పుట్టి అమెరికాలో సెటిల్ అయిన రచయిత్రి. ఆమెది ఒక పాపులర్ కొటేషన్ ఉంది. 'ద క్వశ్చన్ ఈజింట్ హూ ఈజ్ గోయింగ్ టు లెట్ మీ; ది క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ గోయింగ్ టు స్టాప్ మీ'(అసలు ప్రశ్న నన్ను ఎవరు చేయనిస్తారు అని కాదు; నన్ను ఎవరు ఆపుతారు?) నాటు బాషలో చెప్తే 'నన్నెవడ్రా ఆపేది?' ఇది కరెక్ట్ గా మన విజయ్ దేవరకొండ కు సరిపోతుంది. ఎవరు విజయ్ ను స్టార్ కాకుండా ఆపుతారు?
ఎవ్వరూ ఆపలేరు. ఆల్రెడీ అయిపోయాడు కూడా. 'పెళ్లి చూపులు' లో ఒక ఈజీ గోయింగ్ అండ్ కన్ఫ్యూజ్డ్ గా ఉంటూ ఏదో సాధించాలని తపించే కుర్రాడి పాత్ర. అర్జున్ రెడ్డి లో అగ్రెసివ్ - టాలెంటెడ్ మెడికో పాత్ర. ఇప్పుడు గోవిందం గా ఒక సబ్మిసివ్ ఉండే లెక్చరర్ పాత్ర. అన్నీ డిఫరెంట్ షేడ్స్ ఉన్నవే. ఇక రాబోయే సినిమాల్లో 'టాక్సీవాలా' లో ఒక డ్రైవర్ పాత్ర. 'డియర్ కామ్రేడ్' స్టూడెంట్ లీడర్ గా మరో పాత్ర. సో.. అన్నీ ట్రై చేస్తున్న మన రౌడీ గారు ఈసారి ఐటీ ప్రొఫెషనల్ గా సాఫ్ట్ గా కనిపిస్తాడట.
ఈ పాత్రను క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పోషిస్తాడట. అంటే.. టక్కు- టై - ప్రాజెక్ట్ డెడ్లైన్స్ - వీకెండ్ పార్టీలు. అన్నీ. వీటికి తోడు పైన 'పటారం లోన లొటారం' లాంటి జీవితం. సొసైటీమాత్రం ఐటీ అంటే ఊటీ విహార యాత్రలా అనుకుంటూ ఉంటారు.. కానీ ఇన్ కమ్ టాక్సులు - లోన్లు - పింక్ స్లిప్ లు గుర్తొస్తే దీనికంటే ఛాయ్ - సమోసా బండి పెట్టుకుంటే హాయిగా ఉంటుంది కదా అని చాలామంది ఐటీ వాళ్ళకు అనిపిస్తుంది. మరి ఇవన్నీ మన విజయ్ దాదాపుగా కవర్ చేస్తాడు.. వెయిట్ చెయ్యండి! అన్నట్టు ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్తుందట.