క్షణం తీరిక లేకుండా జీవతం సాగాలని కోరుకున్నారా? పెళ్లి చూపులు తర్వాత ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద స్టార్‌డమ్ వచ్చేసింది కదా? ఇదంతా మీరు కోరుకున్నదేనా? అని విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇంత బిజీగా ఉండాలని అనుకోలేదు. అయితే చాలా బిజీ అయిపోయాను. ఒక సినిమా రిలీజవుతోంది అనగానే ఇంకొకటి తరుముకొచ్చేస్తోంది. ప్రతిదీ టెన్షన్ పెంచేస్తున్నాయి. గీతగోవిందం అయ్యింది అనగానే, ఆ వెంటనే నోటా బిజీలో పడిపోయా. బెంగళూరు నుంచి ఇటొచ్చా. హైదరాబాద్ నుంచి మళ్లీ చెన్నయ్ వెళ్లాలి. చాలా టెన్షన్ గా ఉందని దేవరకొండ అన్నారు. తెలుగు - తమిళ్ - కర్నాటక సహా అన్నిచోట్లా ఈ సినిమా రిలీజవుతోంది. అసలు ఆలోచించడానికే టైమ్ దొరకడం లేదు. ఇలా కూచుని ఆలోచించే లోపే వేరొక సినిమా వెంటపడుతోంది.. అని అన్నారు. నిద్ర లేకుండా బిజీ అవ్వాలని కోరుకోలేదు. యాక్టింగ్ అంటే ఇష్టం. బ్యాకప్ ఆప్షన్ కూడా వేరొకటి ప్రిపేర్ చేసుకున్నాను కూడా. రైటర్ - దర్శకత్వం అని కూడా ఆల్టర్నేట్ ఆలోచించా. కానీ నటుడిగా నే అస్సలు క్షణం తీరిక లేనంతగా అయిపోయాను.
`నోటా` రిలీజ్ ని ఆపేస్తామంటూ హెచ్చరికలు వస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు.. దేవరకొండ ఇచ్చిన ఆన్సర్ సర్ ప్రైజింగ్. ఈ ప్రశ్న కాంగ్రెస్సోళ్లను అడగాలి. అసలు నేనే ఎందుకు దొరుకుతున్నానో.. అది కాంగ్రెస్ వాళ్లనే అడగండి! అని అన్నారు. నోటా ఏ ఒక్కరికి సపోర్టుగా కాదు. పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం సహజంగా. ఈ సిస్టమ్ గురించి తెలిసి చాలానే తిట్టుకుంటాం. నేనే కాదు అందరూ తిట్టుకుంటారు. నేను స్వతహాగానే పొలిటికల్ గా అవేర్ నెస్ తో ఉంటాను... అన్నారు. స్కామ్ లు - కుంభకోణాల వేళ సహజంగానే స్పందిస్తుంటాను.. అనీ అన్నారు. ఐరన్ వోర్ స్కామ్ - వరదల వేల స్కామ్ లు అంటూ తిట్టుకుంటాం.. మాట్లాడుకుంటాం. అయితే అదే తరహాలో రాజకీయ నేపథ్యానికి రిలవెంట్‌గా ఉండే పాత్రను నోటాలో చేశాను.. అని తెలిపారు.
ఇందులో జయలలిత ప్రభుత్వ అవినీతిని చూపించారట కదా? అన్న ప్రశ్నకు దేవరకొండ స్పందిస్తూ .. ఏం చూపించామో రేపు థియేటర్లలో చూడండి అంటూ స్కిప్ కొట్టారు. రేపు థియేటర్లలో చాలానే చూస్తారు. తమిళ్ - తెలుగు రెండు వెర్షన్లు ఎక్కడా కటింగ్ అన్నదే లేకుండా సేమ్ టు సేమ్ ఉంటాయి. చూసి మీరే చెప్పండి అని అన్నారు.