గత కొంతకాలంగా రౌడీ విజయ్ దేవరకొండ టాలీవుడ్ లోనే యూనిక్ స్టైల్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. తనదైన స్టైలింగ్.. డ్రెస్సింగ్ సెన్స్ తో రౌడీ బ్రాండ్ హీరోగా పాపులరయ్యాడు. ముఖ్యంగా `డియర్ కామ్రేడ్` సమయంలో అతడు మెట్రోల్లో పర్యటిస్తూ అనుసరించిన స్టైల్ కానీ.. ఇటీవల ఫ్యాషన్ ఐకన్ గా మారి రకరకాల డిజైనర్ డ్రెస్సులతో.. సరికొత్త స్టైలింగ్ తో అలరించిన తీరుగానీ యువతరాన్ని విశేషంగా ఆకర్షించింది. అయితే రౌడీ కొండ ఫ్యాషన్స్ వెనక స్ఫూర్తి ఎవరు? అంటే ఆసక్తికర విషయమే తెలిసింది.
బాలీవుడ్ ఎనర్జిటిక్ మీరో రణ్ వీర్ సింగ్ మన రౌడీ కొండకు స్ఫూర్తి. హైపర్ ఎనర్జీతో విలక్షణమైన ఫ్యాషన్స్ డ్రెస్సింగ్ సెన్స్ ని అనుసరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న రణ్ వీర్ మన టాలీవుడ్ హీరోకి రోల్ మోడల్ అని అర్థమవుతోంది. బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రణ్ వీర్ అనతి కాలంలోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుని బాలీవుడ్ హీరోల్లోనే మోస్ట్ ఎనర్జిటిక్ వైబ్రేంట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. వరుసగా క్రేజీ బ్లాక్ బస్టర్లతో అతడి సక్సెస్ రేటు నింగిని అంటింది. అంతకుమించి అతడు నిరంతరం క్రేజీ డ్రెస్సింగ్ సెన్స్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ.. బాలీవుడ్ లో ప్రధాన ఆకర్షణగా మారాడు. వెరైటీ డ్రెస్సింగ్ సెన్స్ తో తను ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతున్నాడు. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.
బాలీవుడ్ లో ఏ ఇతర హీరోకి సాధ్యం కానిది రణవీర్ కి సాధ్యమైంది. ఇతర హీరోలు రణ్ వీర్ తరహా స్టైలింగ్ తో కనిపించలేదు. అతడిని కొంతవరకూ ఫాలో కాగలిగారంతే. ఇప్పుడు అచ్చం అదే స్ట్రాటజీని టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్నాడు. గత కొంత కాలంగా వెరైటీ డ్రెస్సింగ్ సెన్స్ తో టాలీవుడ్ లో రచ్చ చేసిన విజయ్ యువతరంలో రణ్‌వీర్ తరహా క్రేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు.
ఇటీవల ఏకంగా రౌడీ బ్రాండ్ హీరోగా పాపులరయ్యాడు. తన ఇమేజ్ నే బ్రాండ్ గా మార్చుకుని `రౌడీ` బ్రాండ్ పేరుతో వస్త్ర శ్రేణి వ్యాపారానికి తెరలేపి టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాడు. ఇప్పుడు కెరీర్ పరంగా కొత్త ప్లాన్స్ తో దూసుకెళుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ పైనా కన్నేశాడు. మునుముందు పాన్ ఇండియా హీరోగా సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక ఫ్యాషన్స్ పరంగా విజయ్ కి స్ఫూర్తి ఎవరు? అనేదానికంటే... ఫ్యాషన్ అండ్ స్టైలింగ్ విషయంలో.. కెరీర్ ని మలుచుకుంటున్న వైనంలో దేవరకొండ ఇతర యంగ్ హీరోలకు స్ఫూర్తి అని చెప్పొచ్చు.
Full View