గీత గోవిందం హ్యాంగ్ ఓవర్ విజయ్ దేవరకొండకు దిగిందో లేదో కానీ ప్రేక్షకులకు మాత్రం కాదు. విడుదలై ఇరవై రోజులు కావొస్తున్నా ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్లు రాబడుతున్న ఈ సీజనల్ బెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఏ సినిమా వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న క్రేజ్ కి ఏది వచ్చినా ప్రీ రిలీజ్ తోనే సంచలనం అయ్యేలా ఉంది. టాక్సీ వాలా సంగతి ఏమో కానీ ముందు నుంచి అనుమానించినట్టు నోటానే మొదట వచ్చేలా ఉంది. స్వయంగా విజయ్ దేవరకొండ మాటల ద్వారానే ఇది అర్థం అయ్యింది కాబట్టి ఇక దాని గురించి అనుమానం లేదిక. నిన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ తో పాటు ప్రచారం ప్రారంభించబోతున్నాను అని చెప్పిన విజయ్ దేవరకొండ తాను చెప్పిన ఆ ప్రచారం నోటా గురించే అని చెప్పనక్కర్లేదు. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ యంగ్ సీఎంగా కనిపిస్తాడని ఇప్పటికే టాక్ బలంగా ఉంది. ద్విబాషా చిత్రంగా రూపొందుతున్న నోటా కోసం విజయ్ దేవరకొండ తమిళ్ నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పబోతున్నాడు.
అక్టోబర్ మొదటి వారంలోనే తెలుగు తమిళ వెర్షన్లు ఏకకాలంలో విడుదల చేసే ప్లాన్ లో ఉంది టీమ్. టైం సరిగ్గా నెలరోజులు మాత్రమే ఉంది. దీనికి కారణం లేకపోలేదు. మురుగదాస్ తో తమిళ హీరో విజయ్ చేస్తున్న సర్కార్ కూడా పొలిటికల్ థ్రిల్లర్. దాని కన్నా ముందే నోటా తీసుకురావాలి అనేది నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్లాన్. గీత గోవిందం పుణ్యమా అని కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా విజయ్ దేవరకొండ సుపరిచితుడు అయ్యాడు. ఆనంద్ శంకర్ స్వతహాగా అక్కడి వాడే కాబట్టి వాళ్లకు నేటివిటీ సమస్య రాదు. హీరో మనవాడు కాబట్టి సెటప్ ఎలా ఉన్నా కనెక్ట్ అయిపోతాం. మెహ్రీన్ హీరోయిన్ కావడం ఉభయకుశలోపరి లాంటిది. ఇలా అన్ని రకాలుగా పక్కా ప్లానింగ్ తో ఉన్న నోటా విడుదల తేదీ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. గీత గోవిందం తర్వాత పూర్తి డిఫరెంట్ జానర్ లో వస్తున్న సినిమా కాబట్టి నోటాకు ఆ అంచనాలన్నీ ప్లస్ గా మారి భారీ ఓపెనింగ్స్ ఇవ్వడం ఖాయం.