విజ‌య్ - గౌత‌మ్ ప్రాజెక్ట్ కి అదే అడ్డంకిగా మారుతోందా?

Update: 2022-10-25 09:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ భారీ మూవీకి యువీ క్రియేష‌న్స్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కు దర్శ‌కుడిగా `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్న‌నూరిని ఫైన‌ల్ చేశారు. చ‌ర‌ణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. గ‌త కొన్ని నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌టించిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని మెగా అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. అయితే చ‌ర‌ణ్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వుండ‌టం వ‌ల్ల గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టేశాడంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టిన గౌత‌మ్ తిన్న‌నూరి తదుప‌రి ప్రాజెక్ట్ ని రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌బోతున్నాంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ `లైగ‌ర్‌` మూవతో భారీ డిజాస్ట‌ర్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఫ‌లితంతో పూరి జ‌గ‌న్నాథ్ తో చేయాల‌నుకున్న `జ‌న‌గ‌ణ‌మ‌న‌` ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టేశాడు. ప్ర‌స్తుతం శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో `ఖుషీ` మూవీలో న‌టిస్తున్నాడు.

స‌మంత హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మూవీ త‌రువాత వెంట‌నే గౌతమ్ తిన్న‌నూరితో భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడ‌ట‌. ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి క‌థ వినించాడ‌ని, త‌న‌కు స్టోరీ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని నిర్మాత ఎన్‌. వి.ప్ర‌సాద్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించ‌బోతున్నార‌ట‌.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెన‌క ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ లు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ బ‌డ్జెట్ రూ. 100 కోట్ల‌ని బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌డు ఇదే ఈ సినిమాకు ప్ర‌ధాన ట్విస్ట్ గా మారిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని `లైగ‌ర్‌` త‌ర‌హాలోనే తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో రూపొందిస్తేనే ఈ ప్రాజెక్ట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని చెబుతున్నారు. అన్ని లోక్క‌లు ప‌క్కాగా ఓకే అని ఓ నిర్ధార‌ణ కు వ‌చ్చే ఈ ప్రాజెక్ట్ ఫైన‌ల్ గా ప‌ట్టాలెక్కుతుంద‌ని ఇన్ సైడ్ టాక్.

ఇదిలా వుంటే ప్ర‌స్తుతం `ఖుషీ` మూవీలో న‌టిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ మూవీ త‌రువాత దిల్ రాజు నిర్మించ‌నున్న ప్రాజెక్ట్ లో న‌టించ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న బ‌య‌టికి రానుంది. ఈ మూవీ త‌రువాతే గౌత‌మ్ తిన్న‌నూరి ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌.
Tags:    

Similar News