అరాచకం ప్రమోషన్ అంటే ఇదేనేమో!

Update: 2019-07-22 07:08 GMT
ఇంకో నాలుగు రోజుల్లో డియర్ కామ్రేడ్ విడుదల కానుంది. తన సినిమాల ప్రమోషన్లకు రెగ్యులర్ గా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విజయ్ దేవరకొండ దీనికి మాత్రం చాలా విపరీతంగా ఇంకా చెప్పాలంటే అగ్రెసివ్ ప్రమోషన్ చేస్తున్నాడు. నాలుగు భాషల్లో విడుదల కానుండటంతో ఐదు రాష్ట్రాల్లో ఎడతెగని ట్రిప్పులతో కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతున్నాడు. తనతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా అదే స్థాయిలో పబ్లిసిటీ కోసం తన వంతు సహకారం అందిస్తోంది.

ఒక్క బెంగుళూరు ఈవెంట్ కే 40 లక్షలకు పైగా ఖర్చు అయ్యిందని ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ జోరుగా ఉంది. ఇక చెన్నై కోచి హైదరాబాద్ దేనికీ రాజీ పడకుండా భారీ మొత్తం వెచ్చించారు. ఇదంతా ఓకే అయితే డబ్బింగ్ వెర్షన్ సినిమాలకు ఇంత స్థాయిలో ప్రమోట్ చేసిన హీరో ఈ మధ్యకాలంలో ఎవరూ లేరని చెప్పాలి.  ఇప్పుడు విజయ్ దేవరకొండ పుణ్యమా అని ఇతర స్టార్లు హీరోలు సైతం ముందు ముందు ఇదే స్ట్రాటజీ ఫాలో కావాల్సి వచ్చేలా ఉంది. ఏదో సాహో సైరా లాంటి భారీ విజువల్ వండర్ మూవీకి ఈ స్థాయిలో ఆర్భాటం చేస్తే ఏదో అనుకోవచ్చు.

కానీ డియర్ కామ్రేడ్ రెగ్యులర్ కాలేజ్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఎమోషనల్ లవ్ స్టోరీ. మరీ యాభై అరవై కోట్లు పెట్టి తీసింది కూడా కాదు. అలాంటి సినిమాకే విజయ్ దేవరకొండ ఇంత కష్టపడుతూ ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఇక మిగిలినవాళ్లు కూడా దీన్నే ఫాలో కాక తప్పేలా లేదు. సినిమా తీయడం కంటే దాన్ని జనంలోకి తీసుకెళ్లడమే పెద్ద రిస్క్ గా మారిన ప్రస్తుత తరుణంలో విజయ్ దేవరకొండ తన బ్రాండ్ పట్ల తీసుకుంటున్న శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తోందని ఇండస్ట్రీ సీనియర్లు కామెంట్ చేస్తుండటం విశేషం


Tags:    

Similar News