టాలీవుడ్ న‌యా సూప‌ర్ స్టార్ గోవింద్!

Update: 2018-08-13 14:30 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్....ఇలా ఏ ఇండ‌స్ట్రీలోనైనా ...ఓ సినిమా స‌క్సెస్ కావాలంటే టీజ‌ర్, ట్రైల‌ర్, ప్ర‌మోష‌న్....పాజిటివ్ బ‌జ్...ఇలా అన్నీ సెట్ అవ్వాలి. అయితే, ఇండిపెండెన్స్ డే నాడు విడుద‌ల కాబోతోన్న `గీత గోవిందం`చిత్రానికి మాత్రం విడుద‌ల‌కు ముందే లీకుల బెడ‌ద క‌ల‌వ‌ర‌పెట్టింది. ఓ ఎడిట‌ర్ చేసిన నిర్వాకం వ‌ల్ల దాదాపుగా చిత్రం అంతా ఆన్ లైన్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో, చిత్ర విడుద‌లకు ముందు కీల‌క‌మైన ట్రైల‌ర్ ను విడుద‌ల చేసే చాన్స్ లేకుండాపోయింది. అయితే, ఇన్ని ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య విడుద‌ల కాబోయే సినిమాపై చిత్ర యూనిట్ కు కాస్తో కూస్తో కంగారు ఉంటుంది. కానీ, ఈ చిత్రం విష‌యంలో చిత్ర యూనిట్ కూల్ గా కామ్ గా ఉంది. అందుకు, ఆ చిత్ర హీరో `అర్జున్ రెడ్డి` విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజే కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. విజ‌య్ కు యూత్ లో ఉన్న క‌రిష్మా వ‌ల్ల‌ ఆ సినిమాకు స్టార్ హీరో సినిమా రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ వ‌స్తుండ‌డం ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

`పెళ్లి చూపులు`తో విజ‌య్ దేవ‌ర‌కొండకు మంచి గుర్తింపు వ‌చ్చింది. అయితే, హీరోగా విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చిపెట్ట‌లేదు. ఆ త‌ర్వాత‌, గ‌త ఏడాది విడుద‌లైన‌`అర్జున్ రెడ్డి`తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. బోల్డ్ కంటెంట్ ఉన్న ఆ సినిమాలో న‌టించిన విజ‌య్ ఓవ‌ర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. అయితే, ఆ ఒక్క సినిమాకే అది ప‌రిమితమ‌ని అనుకునేవాళ్ల‌కు తాజాగా `గీత గోవిందం` చిత్రానికి వ‌చ్చిన అడ్వాన్స్ ఓపెనింగ్స్ స‌మాధానం చెబుతాయి. టీజ‌ర్, విజ‌య్ పాడిన `వాట్ ద లైఫ్` పాట‌....ఇప్ప‌టికే ఆ చిత్రంపై క్రేజ్ పెంచాయి. అయితే, తాజాగా లీకుల వ్య‌వ‌హారంతో ట్రైల‌ర్ రిలీజ్ చేసే అవ‌కాశం లేక‌పోయింది. అయితేనేం, విజ‌య్ కు యూత్ లో ఉన్న క్రేజ్....ఈ చిత్రానికి ట్రెమెండ‌స్ పాజిటివ్ బ‌జ్, విప‌రీత‌మైన అడ్వాన్స్ బుకింగ్స్ ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. విజ‌య్ గ్రాండ్ ఓపెనింగ్స్ తో మ‌రో హిట్ కొట్ట‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. గ‌త మూడు నెల‌ల్లో విడుద‌లైన ఏ సినిమాకు ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రాలేదంటే విజ‌య్ క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. అందులోనూ, విజ‌య్ మిన‌హా ...ఈ చిత్రంలో పెద్ద‌గా క్రేజ్ ఉన్న వారు లేరు. సో, ఇక‌పై విజ‌య్ ను బేఫిక‌ర్ గా టాలీవుడ్ న‌యా సూపర్ స్టార్ గా క‌న్సిడ‌ర్ చేసేయొచ్చని ట్రేడ్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ‌తున్నారు.
Tags:    

Similar News