అర్జున్ రెడ్డి విజయంతో ఇమేజ్ అమాంతం ఆకాశాన్ని తాకించిన విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. అందుకే కాబోలు ఏళ్ళ క్రితం పూర్తై రిలీజ్ కాకుండా ల్యాబ్ లోనే ఇరుక్కుపోయిన సినిమాలు కూడా బయటికి వచ్చేస్తున్నాయి. ట్విస్ట్ ఏంటంటే చెప్పుకోదగ్గ స్థాయిలోనే వాటికి బిజినెస్ కూడా జరగడం. విజయ్ దీని గురించి ప్రస్తావిస్తూ తనకు ఇంజనీరింగ్ స్టూడెంట్ మల్లే బ్యాక్ లాగ్స్ ఉండిపోయాయని, ఇది కూడా వాటి కోవలోకే వస్తుందని, పాస్ చేసి ఆశీర్వదించమని కోరడం బాగా పేలింది. ఇది కాకుండా ప్రస్తుతం టాక్సీ వాలా విడుదలకు సిద్ధమవుతూ ఉండగా పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా దసరాలోపు పూర్తయ్యేలా ఉంది. ఇక విజయ్ దేవరకొండ తమిళ్ లో కూడా తన ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
దర్శకుడు ఆనంద్ శంకర్ తో నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించబోయే కొత్త సినిమా మార్చ్ 5 న రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభం కానుంది. దీన్ని ద్విబాషా చిత్రంగా రూపొందించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం లాక్ అయిపోయిందని, విజయ్ దేవరకొండని రెగ్యులర్ గా చూపించే లవ్ స్టోరీస్ తరహాలో కాకుండా సరికొత్త యాక్షన్ యాంగిల్ లో పరిచయం చేసే దిశగా ఇది ఉంటుందని టాక్. వ్యయం కూడా భారీ గానే ఉండబోతుందని తెలిసింది. ఇయర్ ఎండింగ్ లో ఈ మూవీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. హీరొయిన్ సెలక్షన్ ఇంకా జరగాల్సి ఉంది. సూర్యతో తప్ప బయట హీరోలతో చాలా అరుదుగా సినిమాలు తీసే జ్ఞానవేల్ రాజా దీన్ని టేకప్ చేయటం విశేషం.
జ్ఞానవేల్ రాజా గతంలో అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నారు. కాని ఏవో కారణాల వల్ల అది ఎంతకూ ముందుకు సాగడం లేదు. అందుకే తన మొదటి తెలుగు స్ట్రెయిట్ సినిమా హీరోగా విజయ్ దేవరకొండను ఎంచుకున్నాడు రాజా. విజయ్ దేవరకొండకు ఇది మొదటి స్ట్రెయిట్ తమిళ్ మూవీ అవుతుంది. ఆనంద్ శంకర్ విక్రం సినిమా 'ఇంకొక్కడు' ద్వారా దర్శకుడిగా మనకు పరిచయమే. ఇతని మొదటి సినిమా అరిమ నంబి తెలుగులో డైనమైట్ గా రిమేక్ చేసారు. ఇది మూడో సినిమా.