దేవరకొండ కొత్త సినిమా.. పెద్ద సెటప్పే

Update: 2018-03-01 09:58 GMT
‘పెళ్లిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలు తెచ్చిన గుర్తింపుతో ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలందుకున్నాడు విజయ్ దేవరకొండ. అరడజనుకు పైగా కమిట్మెంట్లు ఇచ్చేశాడతను. అందులో రెండు సినిమాలు ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిగతా సినిమాలు కూడా వీలు చూసుకుని పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు విజయ్. అతను త్వరలోనే ఒక ద్విభాషా చిత్రం కూడా చేయబోతున్నాడు. తెలుగు-తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘అరుమా నంబి’ అనే సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచమై.. ఆ తర్వాత విక్రమ్ హీరోగా ‘ఇరు ముగన్’ (ఇంకొక్కడు) సినిమా తీసిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

ఈ చిత్రాన్ని తమిళ అగ్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండటం విశేషం. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ తనయుడు సంతాన కృష్ణన్ రవిచంద్రన్ ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందించనున్నాడు. అతను ఇంతకుముందు మలయాళ బ్లాక్ బస్టర్ ‘2 కంట్రీస్’తో ఛాయాగ్రాహకుడిగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం తమిళంలో ‘ధృవనక్షత్రం’.. హిందీలో ‘బాగి-2’ లాంటి క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఒక ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు మ్యూజిక్ చేస్తాడట. మొత్తంగా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరూ పెద్ద రేంజి వాళ్లే. తొలిసారి ద్విభాషా చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండకు మంచి సెటప్పే కుదిరినట్లుంది.
Tags:    

Similar News