ఫోటో స్టోరి: రౌడీ బ్రాండ్ మీద ఒట్టు

Update: 2019-10-05 05:00 GMT
అంద‌రూ వెళ్లే దారిలో వెళితే దేవ‌ర‌కొండ ఎందుకు అవుతాడు? .. అందుకే త‌న‌కంటూ ఒక దారి ఎంచుకుని ఆ దారిలోనే వెళుతున్నాడు. తొలి నుంచి ఇదే బాట‌ను ఎంచుకుని త‌న‌కంటూ ఒక బ్రాండ్ ఉంద‌ని నిరూపించాడు. వృత్తి ప‌ర‌మైన యాటిట్యూడ్.. ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ప‌రంగా యాటిట్యూడ్.. వ్య‌క్తిత్వం ప‌రంగా యాటిట్యూడ్ .. ఇన్ని యాటిట్యూడ్ లు చూపిస్తున్నాడు. ఆ యాటిట్యూడ్ అభిమానుల‌కు పాజిటివ్ గా క‌నిపిస్తుంటే కొంద‌రికి మాత్రం వేరొక‌లాగా క‌నిపిస్తోంది కూడా.

అదంతా స‌రే.. ``యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్ ఇదే. తన ఫ్యాషన్ బ్రాండ్ `రౌడీ వేర్` కోసం చేసిన ఫొటోషూట్ ఇది`` అంటూ కొన్ని స్టిల్స్ ని రివీల్ చేశారు. ఈ స్టిల్స్ ఆద్యంతం యాటిట్యూడ్ క‌నిపిస్తోంది. రౌడీగారి ఫ్యాష‌న్ పీక్స్ లో ఎలివేట్ అయ్యింది. ఆ చూసే చూపు.. హెయిర్ స్టైల్ .. కాస్ట్యూమ్స్ ప్ర‌తిదీ చాలా గ‌మ్మ‌త్తుగా ఉన్నాయి. బాలీవుడ్ హాలీవుడ్ హీరోల‌కే త‌ల‌తిరిగే స్టైల్ ఇది. మొత్తానికి రౌడీ బ్రాండ్ కి బాగానే పాపులారిటీ తెస్తున్నాడు. రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోనూ తన మార్క్ ని చూపబోతుంద‌ట‌.  త్వరలోని విస్తరించబోతున్న`స్ట్రీట్ వేర్` బ్రాండ్  ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది... అంటూ క‌ల‌రింగ్ ఇచ్చారు.

ఈ బ‌ట్ట‌ల దుకాణాలు.. చెప్పుల దుకాణాల మాటేమో కానీ.. రౌడీగారి కిల్ల‌ర్ లుక్స్ కి మాత్రం ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇంత‌కుముందు డియ‌ర్ కామ్రేడ్ ప్ర‌చార వేదిక‌ల‌పై ఎంత ఇన్నోవేటివ్ లుక్ తో క‌నిపించాడో.. అంత‌కుమించి తాజా ఫోటోషూట్ లో పెప్పీగా.. స్పైసీగా రొమాంటిక్ గా క‌నిపిస్తున్నాడు. ఈ లుక్ చూశాక గాళ్స్ కంటికి కునుకు క‌రువై ఉంటుంది.. రౌడీ బ్రాండ్ మీద ఒట్టు!


Tags:    

Similar News