క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోగా సక్సెస్ అయిన విజయ్ దేవరకొండ సెకండ్ మూవీ తోనే బాక్స్ ఆఫీస్ స్టార్ అయిపోయాడు. అతను చేసిన అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నెక్స్ట్ సినిమాలను ఏ స్టైల్ లో రిలీజ్ చేస్తాడా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్యూట్ లవ్ స్టొరీ - హార్డ్ లవ్ స్టోరీ తర్వాత విజయ్ మరో డిఫెరెంట్ మూవీని చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ కొన్ని ప్రాజెక్టు లతో చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ లో తెరకెక్కిస్తోన్న సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందులో విజయ్ క్యారెక్టర్ చాలా బావుంటుందట. సోలో - శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న పరాశురామ్ దర్శకత్వంలో ఆ సినిమా రాబోతోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 'గీతా గోవిందం' అనే పేరును చిత్ర యూనిట్ ఇటీవల ఫైనల్ చేశారని సమాచారం. త్వరలోనే అధికారికంగా తెలిపే అవకాశం ఉంది.
దర్శకుడు పరశురామ్ తన గత సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాలోనే తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కూడా కొంచెం అదే స్టైల్ లో ఉండనుందని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి హీరోని కొంచెం డీసెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. అలాగే కథను బట్టి కొన్ని మాస్ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఇక టైటిల్ గీతా గోవిందం కూడా అదే ఫార్మాట్ కథని గుర్తు చేస్తోంది. మరి దర్శకుడు ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. ప్రస్తుతం విజయ్ ఈ సినిమాతో పాటు సినిమాటోగ్రాఫర్ రాహుల్ సంకృత్యాన్స్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నాడు.