అలాంటి సినిమాకు దేవరకొండ సూటవుతాడా?

Update: 2018-03-10 23:30 GMT
విజయ్ దేవరకొండ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న నటుడిగా ముద్ర వేయించుకున్నాడు. అతడి నటన.. బాడీ లాంగ్వేజ్.. యాటిట్యూడ్.. అన్నీ కూడా భిన్నంగా కనిపిస్తాయి. అతను డిఫరెంట్ సినిమాలకే సూటవుతాడు అనిపిస్తుంది. రెగ్యులర్ ఫార్మాట్లో నడిచే కమర్షియల్ సినిమాలకు.. సీరియస్ చిత్రాలకు అతను సెట్టవడన్న భావన కలుగుతుంది. ‘పెళ్ళిచూపులు’ తర్వాత అతడి నుంచి వచ్చిన ‘ద్వారక’ ఆ విషయాన్ని రుజువు చేసింది. ఐతే విజయ్ ని హీరోగా పెట్టి తమిళ దర్శకుడు విజయ్ శంకర్ ‘నోటా’ అనే ద్విభాషా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇందులో విజయ్ ఓటేసిన తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ షాకిచ్చాడు.

ఈ లుక్ చూస్తే ఎన్నికల నేపథ్యంలో సాగే సీరియస్ సెటైరిక్ ఫిలింలాగా కనిపిస్తోంది ‘నోటా’. ఐతే విజయ్ దేవరకొండ లాంటి హీరో ఎన్నికలు.. ప్రజా సమస్యలు అంటూ పోరాడితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది డౌట్. నటుడన్నాక ఒక ఇమేజ్ ఛట్రంలో చిక్కుకుపోకుండా విభిన్న పాత్రలు.. సినిమాలు చేయాల్సిందే కానీ.. కొన్ని పాత్రలు తమ బాడీ లాంగ్వేజ్ కు సూటవుతాయో లేదో కూడా చూసుకోవాలి. విజయ్ విషయానికొస్తే కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్లకు అతను బాగా సూటవుతాడు. సీరియస్ గా ప్రజా సమస్యలపై పోరాడే పాత్రల్లో అతను ఏమాత్రం ఇమిడిపోగలడన్నది డౌటే. ‘నోటా’ పోస్టర్ చూస్తే అందులోనూ మిడిల్ ఫింగర్ చూపించడం ద్వారా అర్జున్ రెడ్డినే గుర్తుకు తెస్తున్నాడు విజయ్. మరి ఇలాంటి సినిమాలో అలాంటి యాటిట్యూడ్ అంటే కష్టమే. ఈ సినిమా విజయ్ కు ఏమాత్రం సూటవుతుందన్నది సందేహమే.

Tags:    

Similar News