అరవింద వంద కోట్లకు అందరూ అడ్డమే!

Update: 2018-09-04 09:40 GMT
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను అక్టోబర్ 11 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు నిర్మాతలు. స్టార్ కాంబినేషన్ - భారీ బడ్జెట్ ను బట్టి సినిమాను రూ. 100 కోట్లకు అటుఇటుగా అమ్ముతారు.  దీంతో సినిమా హిట్ కావాలంటే ఖచ్చితంగా 100 కోట్లు వసూలు చేయలసి ఉంటుంది.  అక్టోబర్ లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఎన్టీఆర్ సింగల్ గా దున్నేస్తాడని అనుకున్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలంగా కనిపించడం లేదు.  ఎందుకంటే పోటీ ఇప్పుడు పెరిగింది.  విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' అక్టోబర్ 4 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  'గీత గోవిందం' సూపర్ సక్సెస్ విజయ్ క్రేజ్ చూస్తుంటే 'నోటా' కు భారీ ఓపెనింగ్స్ ఖాయం.  ఇక సినిమా బాగుంటే అది సెకండ్ వీక్ కూడా దుమ్ము లేపుతుంది. ఇది ఖచ్చితంగా 100 కోట్లు వసూలు చేయల్సిన పరిస్థితిలో ఉన్న 'అరవింద సమేత' కు కాస్త మింగుడు పడని విషయమే.  ఇదొక్కటే అనుకుంటే రవి తేజ సినిమా 'అమర్ అక్బర్ అంటోనీ' కూడా 'నోటా' తోపాటుగా రిలీజ్ అవుతుంది.  ఫ్లాప్ కాంబినేషన్ అయినా మంచి టాక్ వస్తే మాత్రం మాస్ రాజా దుమ్ము లేపడం ఖాయం.  బీ -  సి సెంటర్ల లో మాస్ రాజా రచ్చ మామూలుగా ఉండదు .

ఇక అరవింద సమేత రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ లో రామ్-త్రినాధరావు నక్కిన సినిమా 'హలోగురూ ప్రేమకోసమే'.. మరో రెండు రోజులకు విశాల్-లింగుస్వామి 'పందెంకోడి 2' షెడ్యూల్ అయి ఉన్నాయి.  ఇవి తీసేయాల్సిన సినిమాలైతే కావు. ఎన్టీఆర్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి.  కానీ సినిమా కు టాక్ పాజిటివ్ గా లేక పొతే మాత్రం ముందు వెనుక షెడ్యూల్ అయిన సినిమాలతో ఇబ్బంది తప్పదు.  అలా జరగాకుండా ఉండాలంటే 'అరవింద..' కు సూపర్ హిట్ టాక్ రావాలి!




Tags:    

Similar News