మునుపటి ఉత్సహం ఏది దేవరకొండ..?

Update: 2018-10-25 07:12 GMT
విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. ముఖ్యంగా గీత గోవిందం చిత్రంతో విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరోగా మారిపోయాడు. గీత గోవిందం సక్సెస్‌ సంతోషాన్ని ఎంజాయ్‌ చేస్తున్న సమయంలోనే ‘నోటా’ చిత్రం వచ్చి నిరాశ పర్చింది. విజయ్‌ తన క్రేజ్‌ ను నోటా పెంచుతుందని భావించాడు. కాని అనూహ్యంగా ఈ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో నిరాశకు లోనయ్యాడు. ఇలాంటి సమయంలో చాలా రోజులుగా వాయిదాలు పడుతున్న ‘ట్యాక్సీవాలా’ విడుదలకు సిద్దం అయ్యింది.

ట్యాక్సీవాలా చిత్రంపై కాస్త అనుమానం ఉన్న విజయ్‌ దేవరకొండ గత కొన్నాళ్లుగా సినిమాను వాయిదాలు వేయిస్తూ వస్తున్నాడు అంటూ ఆమద్య మీడియాలో వార్తలు వచ్చాయి. ట్యాక్సీవాలా చిత్రంను ఇంకా వాయిదా వేయించలేక పోయిన విజయ్‌ దేవరకొండ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని తీసుకు రాక తప్పడం లేదు. గతంలో వచ్చిన అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం, నోటా చిత్రాలకు ప్రమోషన్‌ చేసిన రేంజ్‌ లో ట్యాక్సీవాలాకు ప్రమోషన్‌ చేయడం లేదనే గుసగుసలు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

సినిమా విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ సందడి కనిపించక పోవడంతో రకరకాలుగా సోషల్‌ మీడియాలో కూడా టాక్‌ వినిపిస్తుంది. నోటా సినిమా ఫ్లాప్‌ నుండి ఇంకా తేరుకోలేక పోతున్న విజయ్‌ దేవరకొండ ఈ చిత్రం ప్రమోషన్‌ లో అంత చొరవ చూపలేక పోతున్నాడేమో అంటూ టాక్‌ వినిపిస్తుంది. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్న కారణంగా ముందు ముందు దేవరకొండ రంగంలోకి దిగుతాడేమో. లక్‌ బాగుండి విజయ్‌ దేవరకొండకు ట్యాక్సీవాలా విజయాన్ని తెచ్చి పెడుతుందేమో చూడాలి.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కూడా ఒక చిత్రాన్ని విజయ్‌ చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

Tags:    

Similar News