విజయ్ దేవరకొండ యాటిట్యూడ్... స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అది కుర్రకారుకి విపరీతంగా నచ్చుతుంటుంది. ఉన్నదున్నట్టు చెబుతూ... బోల్డ్ స్టేట్ మెంట్లతో అదరగొట్టే విజయ్ దేవరకొండ త్వరలోనే `గీత గోవిందం`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ చిత్రం కోసం విజయ్ పాట కూడా పాడేశాడు. ఫ్రస్ట్రేటెడ్ సింగర్ పాడిన పాటగా అది తెరపై కనిపిస్తుందట. అసలు విజయ్ కి ఫ్రస్ట్రేషన్ ఎందుకొచ్చింది? ఏంటా కథ అనేది మాత్రం తెరపై చూసి తెలుసుకోవల్సిందే. ప్రస్తుతానికి మాత్రం విజయ్ పాడిన ఆ పాటని వినిపించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. వాట్ ది ఎఫ్ అంటూ సాగే ఆ పాటని రేపే విడుదల చేయబోతున్నారు.
తాజాగా మేకింగ్ వీడియోని విడుదల చేశారు. అది కూడా విజయ్ స్టైల్లోనే ఉంది. `ఇప్పుడు పాడినట్టే మరొకసారి పాడు... `అని టీమ్ చెబితే... అలా రాదు అని ఇన్నోసెంట్ గా రిప్లై ఇవ్వడం, ఆ తర్వాత ఈ పాటని రెహమాన్ - ఆర్జిత్ సింగ్ - సోనూ నిగమ్ లాంటి వాళ్లతో పాడించాలనుకొన్నారు, వాళ్లెవరూ దొరక్క నాతో పాడించారని చెప్పడం... అందుకు దర్శకుడు అంతే అంతే అని చెప్పడం వీడియోలో కనిపించింది. ఆ వీడియో మొత్తం చాలా ఫన్నీగా ఉంది.
Full View