‘గీతాగోవిందం’ మూవీ సక్సెస్ తో విజయ్ దేవరకొండ సంతోషంగా ఉన్నారు. టాలీవుడ్ లో నాని తర్వాత ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోగా విజయ్ నిలిచాడు. నాని లాగానే స్టాడ్ డం ను తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం మూవీల హిట్స్ తో విజయ్ కు ఇమేజ్ తోపాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది.
అర్జున్ రెడ్డి చేస్తున్న సమయంలోనే విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’, టాక్సీవాలా సినిమాలకు సైన్ చేశాడని తెలిసింది. అర్జున్ రెడ్డి గ్రాండ్ హిట్ కావడం.. విజయ్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ రావడంతో ‘గీతాగోవిందం’ దర్శకుడు పరుశురామ్ కథను చాలా వరకు మార్చాడట. యాంగర్ మేనేజ్ మెంట్ గల అర్జున్ రెడ్డిగా ఇరగదీసిన విజయ్ కి.. గీతాగోవిందంలో గోవింద్ గా ఎలా చేస్తాడు.? ప్రేక్షకులు ఆదరిస్తారా అని పరుశురామ్ తొలుత భయపడ్డాడట.. కానీ చివరకు ప్రేక్షకులు బంపర్ హిట్ చేయడంతో ఊపరిపీల్చుకున్నాడట..
ఇప్పుడు గీతాగోవిందం హిట్ తో విజయ్ తరువాతి సినిమా ‘టాక్సీవాలా’ కథలో కూడా మార్పులు అనివార్యమవుతున్నాయట..ఇప్పటికే విజయ్ ఇమేజ్ కు తగ్గట్టు టాక్సీవాలా కథను మార్చి చాలా వరకూ రీషూట్ చేశారట..అందుకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటికీ రిలీజ్ కావడం లేదు. గీతాగోవిందం సక్సెస్ తో పలు సీన్లను మళ్లీ రీష్యూట్ చేయడానికి డిసైడ్ అయ్యారట..విజయ్ అభిమానులను సంతృప్తి పరిచేలా నటులను, స్క్రిప్ట్ ను మార్చేందుకు టాక్సీవాలా మూవీ మేకర్స్ సిద్ధపడినట్టు ఫిలింనగర్ నుంచి వార్తలొస్తున్నాయి.
ఇలా విజయ్ దేవరకొండకు వచ్చిన ఇమేజ్ ఇప్పుడు ఆయనతో తీస్తున్నదర్శకులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. విజయ్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని కథను మార్చాల్సి వస్తోందట.. అంతేకాదు.. ఎలాగైనా హిట్ కొట్టాలంటే కథకు ఏం అవసరమో అవి సినిమాలో చేర్చడానికి యూనిట్ సిద్ధమవుతున్నాయని తెలిసింది.