విజయ్ దేవరకొండ ఆనందం మామూలుగా లేదు. అర్జున్ రెడ్డి సక్సెస్ యూత్ కి కనెక్ట్ చేస్తే లేటెస్ట్ సెన్సేషన్ గీత గోవిందం ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గర చేసింది. దీని వసూళ్లు చూసి స్టార్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఓ మీడియం రేంజ్ హీరో సినిమా పట్టుమని పది రోజులు కూడా దాటకుండానే 50 కోట్ల షేర్ కు దగ్గరలో వెళ్లడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఈ ఫీట్ సాధించడం పదేళ్లకు పైగా అనుభవం ఉన్న కొందరు హీరోల వల్ల కాలేదు. ఈ నేపధ్యంలో విజయ్ చేస్తున్న తర్వాత సినిమాల పై అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. ఇంకా ఫైనల్ కాపీ రెడీ అయ్యిందో లేదో తెలియని టాక్సీ వాలాకు అప్పుడే క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. బాగుంది అనే టాక్ వస్తే చాలు కనీసం పాతిక కోట్లు తెచ్చే మినిమమ్ గ్యారెంటీ హీరోగా విజయ్ దేవరకొండ ఇప్పటికే ట్రేడ్ లో హాట్ కేక్ గా మారాడు. ఇప్పుడు ఇదే విజయ్ ని టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తుంది. మామూలుగా ఏదైతే అయ్యిందిలే అనే ఒకరకమైన బోల్డ్ యాటిట్యూడ్ తో ఉండే విజయ్ ఆలోచనా ధోరణిలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.
గీత గోవిందం తెచ్చిన ఇమేజ్ వల్ల తన మీద అంచనాలు పెరిగిపోయాయని ఇప్పుడు చేస్తున్న నాలుగు సినిమాల మీద సైతం అలాంటి లెక్కలు మొదలయ్యాయని చెబుతున్నాడు. ముఖ్యంగా చాలా డిఫరెంట్ జానర్ లో చేసిన ఓ మూవీ మాత్రం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నట్టు చెబుతున్నాడు. పేరు ప్రస్తావించలేదు కానీ సెట్స్ మీద ఉన్నవన్నీ దేనికవే విభిన్నమైనవే. అందులోనూ గీత గోవిందం షూటింగ్ లో ఉండగా ఒప్పుకున్నవి. నోటా పొలిటికల్ థ్రిల్లర్ కాగా డియర్ కామ్రేడ్ ఎమోషనల్ గా స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇక టాక్సీ వాలాలో డ్రైవర్ రోల్ అయినప్పటికీ చాలా డిఫెరెంట్ గా ఉండబోతోంది అనేది టీజర్ లోనే అర్థమైపోయింది. మొత్తానికి విజయ్ దేవరకొండకు వచ్చి పడిన స్టార్ ఇమేజ్ కథల ఎంపికలో ఒత్తిడికి గురి చేయబోతోంది అనేది స్పష్టం. ఇది అందరు స్టార్ హీరోలకు వచ్చే సమస్యే అయినా విజయ్ దేవరకొండకు నాలుగో సినిమాకే వచ్చి పడింది. అది అసలు ట్విస్ట్.