ఈ మధ్య కాలంలో యూత్ - ఫ్యామిలీ...ఇలా అన్ని వర్గాలను ఏకగ్రీవంగా ఆకట్టుకున్న చిత్రం `గీత గోవిందం`. గోవిందం పాత్రలో విజయ్ దేవరకొండ జీవించడంతో...ప్రేక్షకులు అర్జున్ రెడ్డిని మరచిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇక గోవిందంతో పోటీపడి గీతగా రష్మిక నటించడంతో గీత - గోవింద్ లు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. క్లాస్ - మాస్ ....ఏ - బీ - సీ....తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్....ఇలా అన్ని చోట్ల `గీత గోవిందం` రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తమిళనాడులో తొలి 5 రోజుల్లోనే 3.3 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా....రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. గీత - గోవింద్ ల వాలకం చూస్తుంటే తమిళనాట నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.
తమిళనాడులో రంగస్థలం మొత్తం కలెక్షన్స్ 3.5 కోట్లు. భరత్ అనే నేను సినిమా 4.3 కోట్లు కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది. అయితే, గీత గోవిందం కేవం 5 రోజుల్లోనే 3.3 కోట్లు కొల్లగొట్టింది. దీంతో, ఫుల్ రన్ లో ఈ చిత్రం “భరత్ అనే నేను” కలెక్షన్స్ రికార్డును అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. టాలీవుడ్ లోనే కాకుండా....కోలీవుడ్ లోనూ స్టార్ హీరోల రికార్డులను విజయ్ బద్దలు కొట్టడం విశేషం. రెండో సినిమాతోనే విజయ్ .....నయా సూపర్ స్టార్ గా అవతరించి రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇక ఫుల్ రన్ లో టాలీవుడ్ లో గోవింద్ ఎంత వసూలు చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.