పెట్టిందంతా ముందే గుంజాడు.. అందుకే రౌడీ!!

Update: 2019-10-31 12:53 GMT
స‌క‌ల క‌ళ‌ల‌యందు రాటు దేలిన‌వాడే క్రియేటివ్ రంగంలో రాణించ‌గ‌ల‌డు. ఇక్క‌డ హీరోయిజం వెల‌గ‌బెడ‌తామంటే కుద‌ర‌దు. దానిని నిరంత‌రం కాపాడుకోవాలి. ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ని ఎదుర్కొని స‌త్తా చాటాలి. రొటీన్ గా ఉంటే ఎవ‌రూ ప‌ట్టించుకోరు ఇక్క‌డ‌. అందుకే త‌మ‌ని నిరంత‌రం లైమ్ లైట్ లో ఉండేందుకు కొత్త‌గా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఈ విష‌యంలో సెంట్ ప‌ర్సంట్ రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస‌య్యాడు. త‌న‌కు నేము ఫేము వ‌చ్చింది మొద‌లు దానిని కాపాడుకునేందుకు అత‌డు ఎంచుకుంటున్న మార్గం ప్ర‌తిసారీ హాట్ టాపిక్. స‌క్సెస్ ని కాపాడుకునేందుకు అత‌డు వేస్తున్న ఎత్తుగ‌డ‌లు ఓ స‌బ్జెక్ట్ గా మారాయి. నెగెటివిటీ రాజ్య‌మేలే చోట అత‌డి పేషెన్స్ గేమ్ ప్లాన్ ఇంట్రెస్టింగ్.

ప్ర‌స్తుతం స్నేహితుడు త‌రుణ్ భాస్క‌ర్ ని హీరోని చేస్తూ.. సొంత బ్యాన‌ర్ లో సినిమాని నిర్మించాడు. దీనికి తాను హీరోగా సంపాదించిన దాంట్లో 70శాతం డ‌బ్బును పెట్టుబ‌డిగా పెట్టేశాడ‌ట‌. అంతేకాదు... పెట్టిన పెట్టుబ‌డి మొత్తం తిరిగి మార్కెట్ వ‌ర్గాల నుంచి గుంజేశాడు. త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాలతో టెక్నిక్ ప్లే చేసి తెలివిగా బిజినెస్ చేసుకోగ‌లిగాడు. రౌడీ బ్యాన‌ర్ తొలి సినిమా `మీకు మాత్ర‌మే చెప్తా` ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతోంది. రిలీజ్ ముందే 70శాతం పెట్టుబ‌డిని తిరిగి రిప్పంచేశాన‌ని చెప్పాడు నిర్మాత‌ దేవ‌ర‌కొండ‌. ఇక రావాల్సింది 30శాతం మాత్ర‌మే. అది థియేట్రిక‌ల్ రిలీజైతే చాలు.. తిరిగి వ‌చ్చేస్తుంది. అయితే పంపిణీదారుల‌కు వంద‌శాతం రిట‌ర్నులు రావాలంటే మాత్రం 200 శాతం హిట్ టాక్ తెచ్చుకోవాలి. హీరోగా త‌రుణ్ భాస్క‌ర్ నిల‌బ‌డాల‌న్నా హిట్ టాక్ కావాలి.

ఇంత‌కీ రౌడీ కెరీర్ లో ఎంత సంపాదించాడు?  నిర్మాత‌గా మొదటి ప్ర‌య‌త్నం ఎంత పెట్టుబ‌డి పెట్టాడు? అంటే.. త‌నే స్వ‌యంగా వివ‌రాలందించాడు. ఎవడే సుబ్రమణ్యం- పెళ్లిచూపులు- ద్వారక- అర్జున్ రెడ్డి- నోటా- గీతగోవిందం ఇన్ని సినిమాల్లో న‌టించ‌గా వ‌చ్చిన పారితోషికాల‌ మొత్తంలోంచి 70శాతం ఖ‌ర్చు చేశాడ‌ట‌. అందులో 70శాతం తిరిగి ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో వ‌చ్చేసింద‌ని చెప్పాడు. ఇక ఇంత మొండిగా ఎందుకు పెట్టుబ‌డి పెట్టాడో కూడా చెప్పాడు. పెట్టిన దానిని తిరిగి ర‌ప్పించుకునే జాన‌త‌నం ఉండాల‌ని న‌వ‌త‌రానికి క్లాస్ తీస్కున్నాడు. ఒక‌వేళ పెట్టింది రాక‌పోయినా దిగులు ప‌డ‌కూడ‌ద‌నే బ‌రిలో దిగాన‌ని .. త‌న‌కు సంపాదించుకునే స‌త్తా ఉంద‌ని ధీమాను వ్య‌క్తం చేశాడు.

ఒక స్థాయి వ‌చ్చాక ధీమా దానంత‌ట అదే వ‌చ్చేస్తుంది. సంపాద‌న‌కు కొద‌వ ఉండ‌దు. ఆదాయానికి దారులు తెరుచుకుని ఉంటాయి. ప‌రిచ‌యాల‌తో అది వ‌స్తుంది. పోయిన డ‌బ్బును తిరిగి తెచ్చుకోగ‌లిగే ఆత్మ విశ్వాసం ఉంటుంది. అయితే అంత‌కుముందు ఎన్నో ఎదుర్కోవాలి. స‌వాళ్ల‌ను ధీటుగా ఎదుర్కొని నిల‌బ‌డ‌గ‌ల‌గాలి. ఈ విష‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌దేళ్ల పోరాటం సాగించి గెలుచుకొచ్చాడు. ఇప్పుడైనా అర్థ‌మైందా విజ‌య్ ని రౌడీ అని ఎందుకు పిలుస్తారో?


Tags:    

Similar News