టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు సౌత్ మొత్తం మీద యూత్ కు ఫెమిలియర్ ఫేస్. ఐదు సినిమాలకే స్టార్ గా మారిన విజయ్ తాజా సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో.. ట్రేడ్ వర్గాల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. మిగతా టాలీవుడ్ హీరోలను విజయ్ ను వేరు చేసేది ఒక్కటే.. అదే విజయ్ 'రౌడీ' యాటిట్యూడ్. తనను ట్రోల్ చేస్తే .. దాన్ని స్టేజ్ మీద గుర్తు చేసి మరీ జోకులేయడం అందరివల్లా కాని పని. ఇక రీసెంట్ గా ఈశా ఫౌండేషన్ స్థాపకుడు 'సద్గురు' జగ్గీ వాసుదేవ్ ను ఇంటర్వ్యూ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నలలో ఇంట్రెస్టింగ్ గా ఉన్న కొన్ని ప్రశ్నలు మీకోసం.
విజయ్: సద్గురు.. మీదగ్గర అన్నీ ప్రశ్నలకు సమాధానాలుంటాయి.. దాదాపు అవన్నీ నిజమేకదా అనిపిస్తాయి. నాకది అశ్చర్యంగా ఉంటుంది. అదెలా సాధ్యం?
సద్గురు: 'దాదాపుగా' అంటే అర్థం ఏంటి?(నవ్వుతూ)
విజయ్: నేనెవరు.. అంటే నా జీవితం లో జరిగినవి నన్ను ఇలా చేశాయి. మరి ఇలాంటి వ్యక్తిగా మారడానికి మీ జీవితం లో ఏం జరిగింది? మీరు అక్కడ కూర్చోడానికి నేను ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటి?
సద్గురు: ఎందుకంటే నీ దగ్గర ప్రశ్నలున్నాయి కాబట్టి(నవ్వుతూ). నాకు లక్షలకొద్దీ ఇంకా ప్రశ్నలుండేవి.. కానీ నా చుట్టూ ఉండేవారికే వాటిగురించి అస్సలేమీ తెలీదని నేను అర్థం చేసుకున్నాను. అందుకని ఆ ప్రశ్నలకు నేను సమాధానాలు ఇచ్చేందుకు నా జీవితాన్ని అంకితం చేశాను.
విజయ్: అందరూ 'ప్రేమ' ఉంటే చాలంటారు. డబ్బులేనప్పుడు ప్రేమ మనతో ఉంటుందా? ప్రేమ.. ధనం... రెండిట్లో ఏది ఉత్తమం?
సద్గురు: డబ్బు వల్ల బయట ఉండే సౌకర్యాలు వస్తాయి.. ప్రేమ అనేది అంతర్గతంగా శాంతినిస్తుంది. బాత్ రూమ్ స్ప్రే ను గ్లోబల్ వార్మింగ్ కు సొల్యూషన్ గా నువ్వు వాడలేవు. ప్రేమ అనేది నీ లోపల జరిగేది.. అది నీ హృదయంలోని తీయదనం. అది ఉందంటే.. నీలోపల ఏదో నిన్ను ప్రేరేపించిందన్నమాట. ఆన్ అంటే స్టార్ట్ కావడానికి ఆఫ్ అంటే ఆగిపోడానికి నువ్వు మిషన్ కాదు. నువ్వు కనుక ఒక విషయంపై నీ మనసును లగ్నం చేస్తే అది అద్భుతంగా మారుతుంది.
అవండీ రౌడీ గారి ఫిలాసఫీ ప్రశ్నలు. అర్థం అయితే సరే.. లేకపోతే 'వాట్ ది ఎఫ్.. ' పాట పాడుకోండి.