రౌడీ హీరోకు గాయాలు

Update: 2018-12-17 05:03 GMT
యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.  గత రెండు మూడు వారాలుగా ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తన చేతికి గాయాలయ్యాయని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన ఎడమ చేతికయిన గాయాన్ని చూపుతున్న ఫోటోను పోస్ట్ చేసి "గాయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి.  ఎందుకంటే జీవితంలో ఏదీ సులభంగా రాదు" అని తన టిపికల్ స్టైల్లోక్యాప్షన్ ఇచ్చాడు.  మరి ఈ గాయాలు షూటింగ్ లో అయ్యాయా లేదా బయట ఏదైనా జరిగిందా అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  'డియర్ కామ్రేడ్' ఫిలిం యూనిట్ కూడా ఈ విషయంలో ఇంకా స్పందించలేదు.   ఈ గాయాల విషయం తెలిపిన వెంటనే 'గెట్ వెల్ సూన్ అన్నా'.. 'జాగ్రత్త అన్నా' అంటూ ఫ్యాన్స్ మెసేజులు పెట్టారు.

భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఒక విద్యార్థి నాయకుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  'టాక్సీవాలా' తరవాత రానున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.


Tags:    

Similar News