రీల్ మీద విన్యాసాలు చేయటం నటులకు మామూలే. వెండితెర మీద వెలిగిపోయే తారలు ఎంతో మంది ఉన్నా.. కొందరు మాత్రమే రియల్ లైఫ్ లోనూ తమ చేతలతో అలా వెలిగిపోతుంటారు. అలాంటి కోవలోకే వస్తారు యువ సంచలనం విజయ్ దేవరకొండ.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబులు.
ఎక్కైడనా ఏదైనా జరిగినా.. ప్రకృతి ప్రకోపానికి బలైన వాటిపై వెంటనే స్పందించే గుణం వీరిద్దరిలో ఎక్కువ. మొన్నటికి మొన్న కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి విలయంపై విజయ్ దేవరకొండ స్పందించటం.. ఆ తర్వాత మిగిలిన టాలీవుడ్ ప్రముఖులు ఆ బాట పట్టటం తెలిసిందే. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తాను హీరోనే అన్న తీరును విజయ్ దేవరకొండ మరోసారి ప్రదర్శించారు.
తన మొదటి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి.. వచ్చిన రూ.25లక్షల్ని విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చి తనలోని కొత్త కోణాన్ని ప్రదర్శించిన విజయ్ దేవరకొండ తన పెద్ద మనసును దాటాడు. ఇటీవల తుఫాను ధాటికి అతలాకుతలమైన కేరళకు తన వంతు సాయంగా రూ.5లక్షలు ప్రకటించిన విజయ్ తనలోని దాతృత్వ యాంగిల్‌ను ప్రదర్శించారు.
ఇటీవల తితలీ తుఫాను కారణంగా సిక్కోలు (శ్రీకాకుళం) దారుణంగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని 169 గ్రామాలు దారుణంగా డ్యామేజ్ అయ్యాయి. వందల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఉండేందుకు గూడు లేని దుస్థితి వారు ఎదుర్కొంటున్నారు. రాక్షస గాలులు.. కుండపోతగా కురిసిన వర్షంతో సిక్కోలు దారుణంగా డ్యామేజ్ అయ్యింది.
ఈ నేపథ్యంలో స్పందించిన విజయదేవరకొండ తన వంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5లక్షల మొత్తాన్ని పంపి తనలోని దాతృత్వ కోణాన్ని ప్రదర్శించారు. తాను సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపిన రూ.5లక్షల వివరాల స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. అందరూ తమ వంతు సాయాన్ని అందించాలని కోరారు. దీనికి స్పందించిన ఆయన అభిమానులు పలువురు.. తాము సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిన వివరాల స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు శ్రీకాకుళం జిల్లాకు జరిగిన నష్టానికి తన వంతు సాయంగా రూ.50వేలు పంపారు. మరి.. మిగిలిన టాలీవుడ్ ప్రముఖులు తమ నిద్ర మత్తును వదిలించుకొని.. దారుణంగా దెబ్బ తిన్న సిక్కోలుకు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తే బాగుంటుంది.