మొన్న జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఊహించినదే అయినా ప్రతిపక్షాల హడావిడి వల్ల కొంత టెన్షన్ నెలకొన్న మాట నిజం. గెలిచి మళ్ళి అధికారంలోకి రావడం ఖాయమయ్యాక సహజంగానే సినిమా పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మహేష్ బాబు లాంటి స్టార్ తో మొదలుకుని నిఖిల్ లాంటి యూత్ హీరో దాకా అందరు ట్విట్టర్ వేదికగా గ్రీటింగ్స్ చెప్పేసారు . సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా ప్రెస్ నోట్ కూడా పంపించారు.
కాని ముందు నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి స్టార్ డం తెచ్చుకున్న హీరోగా ఈ మధ్య ఫుల్ ఫాం లో ఉన్న విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఉండటం మాత్రం అభిమానులను ఆశ్చర్యపరిచింది. తెలంగాణా స్లాంగ్ ని హీరో పాత్ర ద్వారా జనంలోకి తీసుకెళ్ళడంలో విజయ్ సినిమాలు కీలక పాత్ర పోషించాయి. కెసిఆర్ రాజకీయ వారసుడు కేటిఆర్ పలు సందర్భాల్లో విజయ్ దేవరకొండ కొత్త సినిమా వచ్చినప్పుడు ప్రత్యేకంగా వీక్షించి మరీ ట్విట్టర్ లో గ్రీటింగ్స్ చెప్పేవారు. సో సహజంగానే విజయ్ దేవరకొండ నుంచి విషెస్ ఆశించడం తప్పేమీ కాదు.
అయితే తను మాత్రం కావాలనే రాజకీయ సంబంధమైన వాటికి దూరంగా ఉంటున్నాడని రెండు రాష్ట్రాలతో పాటు తమిళనాడును కూడా టార్గెట్ చేసిన విజయ్ దేవరకొండ ఇలా ప్రత్యేకంగా టిఆర్ ఎస్ నో ఇంకో పార్టీకో పొగుడుతూ మెసేజ్ పెడితే అప్ కమింగ్ స్టేజి లో ఉన్న తనను ఒక ప్రాంతం వాడని భావించే అవకాశం ఉందనే ఉద్దేశంతో డ్రాప్ అయినట్టు సన్నిహితుల టాక్. కారణం ఏదైతేనేం ఇది మంచి ఎత్తుగడ అని చెప్పొచ్చు.